Netha ambani : అంబానీ భార్య అంటే ఆమాత్రం ఉండదా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Reliance Industries chief Mukesh Ambani's youngest son Ananth Ambani and Radhika Merchant's wedding celebrations are going on with grandeur.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూలై 12న జరగనున్న ఈ వివాహం వరల్డ్ వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పెళ్లి అనుకుప్పటి నుంచీ ప్రతి చిన్ని విషయం కూడా సెన్సేషన్‌గా మారుతోంది. రీసెంట్‌గా జరిగిన వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నభూతో అన్న రీతిలో జరగ్గా.. యావత్ ప్రపంచం ఈ వేడుకల గురించి మాట్లాడుకుంది. ఇక.. పెళ్లి వేడుకలు మొదలయ్యింది మొదలు అవి కూడా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నోళ్లు వెళ్లబెట్లేలా చేస్తున్నాయి. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం. ఆపై పెళ్లి పత్రిక.. ఇలా ప్రతి ఒక్కటీ అంచనాలకు అందకుండా.. అంతకు మించి అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా.. నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్, నగలు అందరినీ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖేష్ అంబానీ భార్యగా, అనంత్ అంబానీ తల్లిగా.. అంతకు మించి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తగా తన హోదాకు తగ్గట్లుగా తన హోదాను, స్టైల్‌ను మిక్స్ చేస్తూ నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్ అండ్ ఆర్నమెండ్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి.
జూలై 5న తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు జరిగిన వేడుకల సందర్భంగా నీతా అంబానీ ఒక ఈవెంట్ కోసం ధరించిన ఒక లెహంగా ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈథెరియల్ లెహంగా చోలీలో నీతా అంబానీ ఎప్పటిలాగానే ఎంతో అందంగా హుందాగా కనిపించడమే కాకుండా.. చూసిన వెంటనే వారేవా అనిపించేలా ఉన్నారు. పచ్చ, వజ్రాభరణాలతో కలిసి డిజైన్ చేసిన ఈ లెహంగా ధగధగల్లో లో నీతా అంబానీ దేవకన్యలా మెరిసిపోతూ ఆహుతుల్ని మైమరిపించారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. లెహంగాపై క్లాసిక్ మల్టీ-హ్యూడ్ సాంప్రదాయ జర్దోసీ ఎంబ్రాయిడరీ లెహంగాకు అందంతో పాటు ఎంతో గాంభీర్యాన్ని అందించింది.. కుందన్ ఎంబ్రాయిడరీతో అలంకరించిన బ్లౌజ్.. లెహంగాకు అదనపు అందాన్ని తీసుకొచచింది. పాతకాలపు మీనకారి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కు క్లాసిక్ అందాన్ని తీసుకు వచ్చింది. దీని మీదకు చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జరీ బార్డర్‌లతో అల్లిన బనారస్ టిష్యూ దుపట్టాను ధరించిన నీతా అంబానీ.. ఓ మహరాణిలా ఎంతో హుందాగా దర్జాగా కనిపించారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి నీతా తన స్టైల్ అండ్ క్లాసిక్ లుక్‌తో అదరగొట్టేసారంటున్నారు.