ఓజీలో జల్సా సాంగ్ రీమేక్.. హీరో సుజిత్ ప్లానింగ్ ఏంటో మరి..?
పవన్ కళ్యాణ్ కెరీర్ లో జల్సా సినిమా ఖచ్చితంగా స్పెషల్. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న టైంలో వచ్చిన ఆ సినిమా పవన్ కళ్యాణ్ ను హీరోగా మళ్లీ నిలబెట్టిందనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో జల్సా సినిమా ఖచ్చితంగా స్పెషల్. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న టైంలో వచ్చిన ఆ సినిమా పవన్ కళ్యాణ్ ను హీరోగా మళ్లీ నిలబెట్టిందనే చెప్పాలి. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ జనాలకు నచ్చుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అని కాకుండా ప్రతి ఒక్కరు ఆ సినిమాను చూస్తారు. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్ అవుతున్నాయి. కామెడి కూడా వేరే లెవెల్. ఇక అప్పట్లో వచ్చిన పాటలు కూడా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
పవన్ కళ్యాణ్ ఎంతో కష్టాలు పడుతున్న సమయంలో వచ్చిన ఆ సినిమా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని కూడా భారీగా పెంచిందని చెప్పాలి. అప్పట్లో మహేష్ బాబు ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఒక సెన్సేషన్ అయింది. మహేష్ బాబు లాంటి హీరో.. పవన్ కళ్యాణ్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వటంతో జనాలు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. భారీగా కలెక్షన్లు రావడంతో నిర్మాతలకు లాభాల పంట పండిందనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి మొదలైన వాళ్ళిద్దరి కాంబినేషన్ తర్వాత దుమ్ము రేపింది.
అయితే ఇప్పుడు ఆ సినిమాలోని ఒక పాటను.. పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో వాడుకోవడానికి డైరెక్టర్ సుజిత్ రెడీ అవుతున్నాడు. దీనికోసం ఇప్పటికే ఆ సినిమా నిర్మాతల పర్మిషన్ కూడా అతను తీసుకున్నాడు. ఓజి సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సుజిత్.. ఈ సినిమాలో ప్రతి ఛాన్స్ ను వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే డేట్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతూ అధికారిక కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు.
వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లడం లేదు. ఇక ఈ సినిమాలో జల్సా సినిమాలోని చలోరే చలోరే చల్ చల్.. అనే పాటను రీమేక్ కి మేకర్స్ రెడీ అయ్యారట. నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ సినిమానే కాబట్టి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తో కాస్త బిజీ అయ్యే అవకాశం కనబడుతోంది. మరో నాలుగు రోజులు షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది.
దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉండదు. అనుకున్న డేట్ కి సినిమాను రిలీజ్ చేయవచ్చు. ఇప్పటికే ఐదు ఏళ్ల నుంచి సినిమా వాయిదా పడుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ లో అటెండ్ కాలేకపోతున్నారు. ఆయన కంటిన్యూగా దాదాపు రెండు వారాలు షూటింగ్ కు రీసెంట్ గా అటెండ్ అయ్యారు. ఎలాగైనా సరే సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు అలాగే డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు కాస్త ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ గా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.