Renu Desai Health: రేణు దేశాయ్ తీవ్ర అనారోగ్యం.. వాలెంటైన్స్ డే రోజు ఎమోషనల్ పోస్ట్
వాలెంటైన్స్ డే రోజు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్టింగ్ పెట్టారు. పర్సనల్ లైఫ్ గురించి కాదు.. ఆరోగ్యం గురించి !

Renu-Desai
పవన్ కల్యాణ్‌తో విడాకులు అయిపోయి.. దూరంగా ఉంటున్నా.. రేణుదేశాయ్‌ను ఇప్పవదినే అంటారు అభిమానులు ఇప్పటికీ ! అకీరాను అయితే జూనియర్ పవర్‌స్టార్ అని సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. పవన్, రేణు జోడి.. ఆల్‌టైమ్ ఫేవరెట్ అనేవాళ్లు ఎంతోమంది ! అందుకే వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. ఇద్దరి పెయిర్ గురించి స్పెషల్‌గా చర్చించుకుంటారు. ఐతే ఇలాంటి వాలెంటైన్స్ డే రోజు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్టింగ్ పెట్టారు. పర్సనల్ లైఫ్ గురించి కాదు.. ఆరోగ్యం గురించి !

Renu Desai Tweet
ఈ మధ్య హీరోయిన్లంతా వరుసగా అనారోగ్యం బారినపడుతున్నారు. సమంత, మమతామోహన్ దాస్, హంసనందిని, కల్పికా గణేణ్.. హీరోయిన్లందరూ వరుసగా సమస్యలు బయపెడుతున్నారు. సమంత అనారోగ్యం గురించి చర్చ జరుగుతుండగానే.. తనకూ ఓ జబ్బు ఉందని రేణుదేశాయ్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్ల నుంచి గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డానంటూ రేణు పెట్టిన పోస్ట్.. అభిమానులను కన్నీరు పెట్టిస్తోంది. తాను మాత్రమే కాదు.. తనలా అనారోగ్యంతో బాధపడేవారు బలంగా నిలబడాలనే.. పాజిటివ్ ఎనర్జీ కోసమే ఈ పోస్టు పెడుతున్నానని రాసుకొచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యం కోల్పోవద్దని.. బలంగా నిలబడాలని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తనకు ఇప్పుడు చికిత్స జరుగుతోందని.. మందులు వేసుకుంటున్నాను.. యోగా చేస్తున్నానను.. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను.. త్వరలోనే మళ్లీ మాములు మనిషిలా తిరిగొస్తానంచటూ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది రేణు.
ఐతే సమస్య ఏంటనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. త్వరగా కోలుకోవాలంటూ.. అభిమానులు వరుస కామెంట్లు పెడుతున్నారు. వాలెంటైన్స్ డే రోజు రేణు పెట్టిన పోస్ట్‌తో.. అభిమానుల్లో బాధ కనిపిస్తోంది. రేణుదేశాయ్ ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో యాక్ట్ చేస్తోంది.