Renu desai: ఆవిడెవరో తెలియదు కానీ.. ఆమె మాటలు విని కన్నీళ్లు వచ్చేశాయి: రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరో ఒక మహిళ తన గురించి చేసిన వ్యాఖ్యలపై రేణూ స్పందించారు. ఆమె మాటల వల్ల తాను ఎంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. ఆ మహిళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Renu desai: పవన్ కల్యాణ‌్ నుంచి విడాకులు తీసుకున్న నటి రేణు దేశాయ్ అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, తన కొడుకు అకీరా నందన్ విషయాల్లో తరచూ స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.
ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరో ఒక మహిళ తన గురించి చేసిన వ్యాఖ్యలపై రేణూ స్పందించారు. ఆమె మాటల వల్ల తాను ఎంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. ఆ మహిళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. రెండేళ్లక్రితం విడాకులు తీసుకున్న హీరోయిన్ సమంతతోపాటు, రేణూ దేశాయ్ గురించి ఆమె మాట్లాడారు. “హీరో-హీరోయిన్లు పెళ్లి చేసుకుని, కొంతకాలం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతే.. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్లనే తప్పుబడతారు. వాళ్లనే తిడతారు. సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకత వల్ల ఆ మహిళలు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు” అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.
దీనిపైనే రేణూ దేశాయ్ స్పందించారు. “నాకు ఆవిడ ఎవరో అని తెలీదు. ఆవిడ నా గురించే ఎందుకు మాట్లాడిందో తెలియదు. కానీ, మొదటిసారి పబ్లిక్‌లో ఇలా నా తరఫున మాట్లాడటం విని నేను చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెబితే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాను అంటారు. కానీ, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు. నాకు ఈ వీడియో చూసి నా బాధ అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారు అని ధైర్యం వచ్చింది” అని రేణూ సోషల్ మీడియాలో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రేణు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ దాదాపు 11 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలున్నారు.