కొంతమంది ఎప్పుడూ న్యూస్ లో సెన్సేషన్ అవుతూనే ఉంటారు. వాళ్ల గురించి ఏం న్యూస్ వచ్చిన సరే కామన్ పీపుల్ లో ఒక క్రేజ్ ఉంటుంది. ఆ కేటగిరీలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య మాజీ హీరోయిన్ రేణు దేశాయ్. అప్పుడప్పుడు మీడియాలో కనబడి సందడి చేసే రేణు దేశాయ్ ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నారు. పిల్లల విషయంలో పక్కా లెక్కలతో ఉండే రేణు దేశాయ్ తన కొడుకు అకిరా నందన్ ను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నారు అఖిర విషయంలో రేణు దేశాయ్. ఇక రీసెంట్ గా అఖీరా గురించి బయటకు వచ్చిన కొన్ని న్యూస్ లు కూడా పవన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ పీపుల్ లో కూడా ఒక క్రేజ్ పెంచాయి. లేటెస్ట్ గా గోదావరి జిల్లాల టూర్ కు వెళ్లిన రేణు దేశాయ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకు సినిమా ఎంట్రీ గురించి అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి కూడా కామెంట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ లోకల్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో తెలుగు సినిమా డెవలప్ అయితే తనకు సంతోషమేనని తన ఒపీనియన్ బయటపెట్టారు. కొబ్బరి అరటి అలాగే ఇతర తోటలో పచ్చని పొలాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ అని ఎందుకంటారో అర్థమైందంటూ కామెంట్ చేశారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులన్న రేణు దేశాయ్.. తన కొడుకు గురించి మాట్లాడుతూ.. తన కొడుకు అకీరానందన్ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాను అని.. అకిరా సినిమాల్లోకి రావడం గురించి తాను ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. తన కొడుకు హీరోగా కచ్చితంగా మెస్మరైజ్ చేస్తాడని రేణు కామెంట్ చేశారు. సినిమా షూటింగులకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంచి ప్లేస్ లు ఉన్నాయని.. షూటింగ్ కు కావాల్సిన ప్లేస్ లు అన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు.. వేరే ప్రాంతాలకు వెళ్లడం ఎందుకని కామెంట్ చేశారు. ఇక మూడు నెలల క్రితం తన కుమార్తె ఆధ్యా పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నానని.. ప్రస్తుతం తాను మూడు సినిమాల్లో నటిస్తున్నానని సినిమా రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. రీసెంట్గా ఏపీలో సినిమా పరిశ్రమ అడుగు పెట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో సమస్యలు ఉన్న నేపథ్యంలో ఏపీలో సినిమా పరిశ్రమ అడుగు పెడితే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది. మరి దీనిపై సినిమా పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.[embed]https://www.youtube.com/watch?v=jLZTp-IP9Ec[/embed]