prathinidhi-2 : ఎన్నికలకు మూడ్రోజులు ముందు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం (Political) ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ (prathinidhi-2).

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 5, 2024 | 03:45 PMLast Updated on: May 05, 2024 | 3:45 PM

Rep 2 Movie Release Before Ap Assembly Elections

 

 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం (Political) ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ (prathinidhi-2). ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. దాదాపు ఆరు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం ‘ప్రతినిధి 2’. పాపులర్ జర్నలిస్ట్ (Popular Journalist) మూర్తి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమిది.

ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘ప్రతినిధి 2’ చిత్రాన్ని మే 10న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పైగా దాదాపు ఆరేళ్ళ తర్వాత నారా రోహిత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దానికితోడు ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. కాంటెంపరరీ పాలిటిక్స్ ను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘ప్రతినిధి 2’ పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే.. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘ప్రతినిధి 2’ అనివార్య కారణాలతో వాయిదా పడింది. లేటెస్ట్ గా మే 10న ‘ప్రతినిధి 2’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. పొలిటికల్ ఫిల్మ్ గా వస్తున్న ‘ప్రతినిధి 2’ ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటుందో చూడాలి.