నా పోరాటం ఆస్తుల కోసం కాదు: మనోజ్

మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన మంచు మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని... కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరడం గమనార్హం. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదని స్పష్టం చేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2024 | 12:14 PMLast Updated on: Dec 10, 2024 | 12:14 PM

Responding To Mohan Babus Complaint Manchu Manoj Made Strong Comments

మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన మంచు మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని… కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరడం గమనార్హం. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదని స్పష్టం చేసాడు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్న మనోజ్ ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం బాధాకరం అన్నాడు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నామన్నాడు.

నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారని ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమైనాయని ఆరోపించాడు. నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసన్న మనోజ్ విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారన్నాడు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి ,కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారన్నాడు. నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని స్పష్టత ఇచ్చాడు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామన్నాడు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని విద్యాసంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నానని తెలిపాడు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు.