Prabhas And Mahesh Fans: పవర్ స్టార్ ని నెత్తిన పెట్టుకుంటున్న ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ , మహేశ్ బాబు ఫ్యాన్స్ నిజంగానే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్ తో పవన్ ఫ్యాన్స్ మధ్య బయట వార్ జరిగేది. రికార్డులు, సినిమా రిలీజ్ లు లేదంటే, మరేదో కారణంతో ఒకరితో మరొకరి ఫ్యాన్స్ గొడవపడేవాళ్లు.

Prabhas and Mahesh Fans Blood Donate At Chiranjevi Blood Bank
కాని పవన్ ఒక్క మాటతో లెక్కేమారింది. ప్రభాస్, మహేశ్ కి పొరుగు రాష్ట్రల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్, బన్నీ వీళ్లు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఉంది. పొరుగు రాష్ట్రం పోతే తనెవరో ఎవరికీ తెలియదు. ఈ నిజం ఒప్పుకోవటానికి తనకి ఈగో లేదన్న పవన్ మాటల వీడియో బుధవారం నుంచి నెట్లో వైరలౌతునే ఉంది.
ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్ పవన్ పేరు చెప్పి చిరు బ్లడ్ బ్యాంక్ లో రక్త దానానికి రెడీ అయ్యారట. తమ అభిమాన హీరోని ఆకాశానికెత్తిన పవన్, తను తగ్గి మిగతా ఫ్యాన్స్ మనసుల్లో నెగ్గాడనంటున్నారు. ఈ ప్రాసెస్ లో చిరు బ్లడ్ బ్యాంక్ కి మహేశ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా పదివేలకి పైగా ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్ రక్తదానం కార్యక్రమం ప్లాన్ చేయటంతో అసలు పవర్ స్టార్ మాటలకు రెస్పాన్స్ కూడా సెన్సేషన్ అయ్యేలా ఉంది.