వద్దంది బెనిఫిట్ షోలే… టికెట్ రేట్లు కాదు.. అర్ధమవుతుందా…?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల భేటీ విజయవంతం కాలేదు అంటారు. కాని అయిందనే క్లారిటీ కొంచెం అబ్జర్వ్ చేస్తే వస్తుంది. అదేంటి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పారు కదా అంటారా...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 12:41 PMLast Updated on: Dec 27, 2024 | 12:41 PM

Revanth Didnt Clarity About Ticket Rates

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల భేటీ విజయవంతం కాలేదు అంటారు. కాని అయిందనే క్లారిటీ కొంచెం అబ్జర్వ్ చేస్తే వస్తుంది. అదేంటి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పారు కదా అంటారా…? ఇక్కడే ఒక కిటుకుంది… సంధ్య థియేటర్ ఘటన తర్వాత… ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేదని… టికెట్ ధరల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించారు.

ఇక ఆయనను ఏదో ఒక రకంగా కూల్ చేసి తమ పని పూర్తి చేసుకోవాలని… భావించిన సినిమా పరిశ్రమ పెద్దలు గురువారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లారు. ఇక ఆయనకు శాలువాలు కప్పి… నమస్కారాలు పెట్టి మీ అంతటి వాళ్లు లేరంటూ బతిమిలాడి బయటకు వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి కూడా తాను గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉంటాను అంటూ క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని శాంతి భద్రతల విషయంలో అసలు రాజీ పడేది లేదని అన్నారు.

కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడలేదు. ఇప్పటివరకు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గాని… ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం గాని టికెట్ ధరలు పెంచుకునే విషయంలో రేవంత్ రెడ్డి ఎటువంటి అభ్యంతరాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను వీడియో రూపంలో చూపించి శాంతిభద్రతలు తనకు ముఖ్యమని బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటానని… భవిష్యత్తులో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అని క్లారిటీ ఇచ్చారు. కానీ టికెట్ ధరల పెంపు విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

అంటే తాను పెంచుతా అని గాని పెంచాను అని గాని చెప్పలేదు. కాబట్టి ఈ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ కాస్త సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. ఒకరోజు పెంచుతారా రెండు రోజులు పెంచుతారా అనేది మాత్రం క్లారిటీ లేదు. పెంచితే మరీ పుష్ప 2 సినిమా రేంజ్ లో పెంచుతారో లేదా… కొంతవరకు పెంచుతారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. చెప్పిన మాటకు కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉండే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ విషయంలో కూడా పట్టుదలగానే ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచుతారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.

అసెంబ్లీలో చెప్పిన మాటలు రెండు… బెనిఫిట్ షోలు… టికెట్ ధరలు.. మొదటి మాట విషయంలో క్లారిటీ గానే రేవంత్ రెడ్డి ఉన్నారు. రెండో మాట విషయంలో మాత్రం సినిమా పరిశ్రమకు కాస్త వెసులుబాటు కల్పించే విధంగానే మాటలు మాట్లాడారు. కాబట్టి బెనిఫిట్ షోస్ లేకపోయినా పర్వాలేదు. ఒకటి రెండు షోలు కోసం అనవసరంగా రేవంత్ రెడ్డిని కెలకడం ఎందుకు అని సినిమా పరిశ్రమ కూడా ఆయనను పెద్దగా బతిమిలాడే ప్రయత్నం చేయలేదు. ముందు ఆయనను దగ్గర చేసుకుంటే తర్వాత మన పనులు మనం చక్కబెట్టుకోవచ్చని సినిమా వాళ్ళు ఒక లాజిక్ ప్రకారం నవ్వుతూ బయటకు వచ్చారు. కుదిరిన వాళ్ళు రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగి శాలువాలు చెప్పారు. మరి కొంతమంది స్వీట్ బాక్స్ లు కూడా ఇచ్చి వచ్చారు.