ఏదేమైనా మెగా రేంజ్ వేరు. పరిస్థితి ఎలా ఉన్నా తమకు ఫేవర్ గా మార్చుకోవడంలో వాళ్లకు మించిన ఫ్యామిలీ టాలీవుడ్ లో లేదు. ఇప్పుడు ఏపీలో, తెలంగాణాలో సినిమా వాళ్లకు హార్డ్ టైం పక్కాగా నడుస్తుంది. అందులో నో డౌట్. బెనిఫిట్ షో క్యాన్సిల్ అనే డెసిషన్ రేవంత్ రెడ్డి తీసుకున్న తర్వాత సినిమా వాళ్లకు భయం స్టార్ట్ అయింది. ఏదో అనుకుంటే ఏదో అవ్వడంతో అల్లు ఫ్యామిలీ కూడా... అందరితో నవ్వుతూ మాట్లాడుతూ మనం మనం... బరంపురం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక మెగా ఫ్యామిలీ తమ సినిమాలకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సంధ్య థియేటర్ ఘటన విషయంలో సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డిని మెగా ఫ్యామిలీ బుట్టలో వేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రీసెంట్ గా హైదరాబాదులో కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన సినిమా పెద్దలు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి చిరంజీవి హాజరు కాలేదు. మెగా ఫ్యామిలీ నుంచి కేవలం సాయి ధరం తేజ్ మాత్రమే హాజరయ్యాడు. చిరంజీవి హాజరయ్యే ఛాన్స్ ఉందని అందరూ అంచనా వేసినా ఆయన రాలేదు. అయితే ఇప్పుడు హైదరాబాదులో గేమ్ చేంజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డిని ఆహ్వానించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీలో జరగబోయే ఈవెంట్ కు అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానిస్తామని ఇప్పటికే దిల్ రాజు ప్రకటన కూడా చేశారు. జనవరి ఒకటో తారీఖున న్యూ ఇయర్ కానుకగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అమెరికాలో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. ట్రైలర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను ఇప్పటివరకు పెద్ద సినిమాల కార్యక్రమాలకు ఇన్వైట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉండటంతో ఆయనను ఇన్వైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నిర్మాత దిల్ రాజు నేడు అమరావతికి వెళ్లి ఆయనను కలిసారు. ఇప్పటికే విజయవాడలో 4,5 తేదీల్లో ఫ్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్న టీం ఆయనను ఇన్వైట్ చేసి... సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చే ప్లాన్ చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కాబట్టి కూల్ చేయవచ్చు. మరి రేవంత్ ను దిల్ రాజు ఎలా కూల్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా రామ్ చరణ్ కోసం సీఎం, డిప్యూటి సీఎం రావడం మాత్రం సెన్సేషన్.[embed]https://www.youtube.com/watch?v=1dNHBYuXiI0[/embed]