RGV: హే.. మళ్లీ ఏసేశాడు.. చంద్రబాబుకు ఆర్జీవీ బర్త్‌డే గిఫ్ట్!
ఇప్పటికే లోకేశ్ పాదయాత్ర మీద సెటైర్లు వేస్తున్న వర్మ.. తాజాగా చంద్రబాబు బర్త్ డే రోజు ఆయనకు ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫొటోస్‌తో ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. నిజానికి ఈ సాంగ్‌కు సంబంధించి ముందు రోజే హింట్ ఇచ్చాడు.
RGV: వివాదాలను పర్సులో పెట్టుకుని తిరుగుతుంటారు ఆర్జీవీ. అదీ ఇదీ అని కాదు.. అన్ని విషయాలో వేలు పెట్టేస్తుంటారు. రాజకీయాలను, నాయకులను కూడా వదలరు. ఆర్జీవీ కోపానికి కారణమేంటో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబును ప్రతీసారి టార్గెట్ చేస్తుంటారు ఆర్జీవీ. ఇప్పటికే లోకేశ్ పాదయాత్ర మీద సెటైర్లు వేస్తున్న వర్మ.. తాజాగా చంద్రబాబు బర్త్ డే రోజు ఆయనకు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫొటోస్‌తో ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. నిజానికి ఈ సాంగ్‌కు సంబంధించి ముందు రోజే హింట్ ఇచ్చాడు. ఇందులో వినిపించే వాయిస్ తన గొంతులానే ఉంటుందని.. కానీ తనది కాదంటూ.. తన మార్క్ కన్ఫ్యూజన్ డైలాగ్ ఒకటి వదిలేశాడు వర్మ. ఈ బర్త్‌డే సాంగ్‌లో ఒక పదం అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తోంది. ఆ పదం “సిక్కో”. వింత, క్రూరమైన పనులు చేయడం ద్వారా ఆనందాన్ని పొందే వ్యక్తి అని దాని అర్థం. ఇంత పెద్ద మాట అని.. తన మార్క్ కవరింగ్ ఇచ్చాడు ఆర్జీవీ. ఈ సాంగ్‌ను ఏఐ రెడీ చేసిందని.. తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాసుకొచ్చాడు. ఐతే ఆ మాటలన్నీ వర్మ పెన్ నుంచి వచ్చినవే అని నెటిజన్లు డిస్కషన్ మొదలుపెట్టారు.
ఈ సాంగ్ చూసిన అందరికీ వచ్చే అనుమానం ఒక్కటే.. చంద్రబాబును వర్మ ఇక వదలడా అని! ఐతే అది ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే మూవీ తీసి ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టిన ఆర్జీవీ.. ఆ తర్వాత కూడా సమయం దొరికిన ప్రతీసారి టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. క్రియేటివిటీతో టీడీపీని ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను కూడా టార్గెట్ చేశాడు. జగన్ యాత్రతో దీన్నికంపేర్ చేస్తూ.. పాదయాత్రను కూడా కాపీ చేస్తారా అంటూ విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు ఏకంగా బర్త్ డే గిఫ్ట్ అంటూ చంద్రబాబు మీదే విమర్శలు చేస్తున్నాడు. ఈ సాంగ్ మీద వైసీపీ నుంచి ఫన్నీ రియాక్షన్ వినిపిస్తోంది. సాంగ్ అంతా ఒకెత్తు.. పాట చివరలో చంద్రబాబు ఏడ్చిన వాయిస్ ఇంకో ఎత్తు అంటూ వాళ్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.