RGV VYOOHAM: ఆర్జీవీకి సినిమా కష్టాలు.. వ్యూహం రివర్స్‌.. వాళ్ల విషయంలో వర్మ ఫెయిల్ అయ్యాడా..

తనకు అస్సలు నచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారట వర్మ. పాత్రలకు వాళ్ల ఒరిజనల్ పేర్లే పెట్టి మరీ తీశారట ఈ సినిమాను. దీనికి సంబంధించి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్స్ హిట్ కొట్టాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 01:58 PMLast Updated on: Dec 02, 2023 | 1:58 PM

Rgv Vyooham Postponed Agaian Due To Censor Issues

RGV VYOOHAM: వ్యూహం పేరుతో ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితాన్ని తెరకెక్కించారు డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ. వైఎస్ అకాల మరణం తర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, కాంగ్రెస్ పార్టీలో జగన్ పడ్డ బాధలతోపాటు, ప్రతిపక్షాలని ఇందులో చూపించారట. అంత వరకు అయితే అది వర్మ సినిమా ఎందుకు అవుతుంది? అంతకుమించి అందులో చాలా చాలా కంటెంట్ ఉందట. ముఖ్యంగా తనకు అస్సలు నచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారట వర్మ. పాత్రలకు వాళ్ల ఒరిజనల్ పేర్లే పెట్టి మరీ తీశారట ఈ సినిమాను. దీనికి సంబంధించి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్స్ హిట్ కొట్టాయి. సినిమా విడుదలకు నవంబర్ 9న ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్.

India Today Exit Polls : ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్‌పై చర్చ.. 2018లో ఏం చెప్పిదంటే..

అయితే అప్పటికి సినిమా సెన్సార్‌కు వెళ్లలేదు. అక్టోబర్ 30న ఆ కార్యక్రమం జరగ్గా.. చంద్రబాబు, పవన్‌లను పోలిన పాత్రధారులకు అవే పేర్లు పెట్టడాన్ని సెన్సార్ బోర్డు తప్పుపట్టింది. పైగా సినిమా అంతా సమకాలీన అంశాలతో.. అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలే ఉండటం కూడా సెన్సార్ బోర్డ్‌కు నచ్చక రిజక్ట్ చేశారు. దీంతో షాక్ తిన్న వర్మ అండ్ కో.. రివైజ్డ్ కమిటీకి అప్పీల్ చేసుకుంది. అయినా స్పందన లేదు. దీంతో తెలంగాణ హైకోర్టులో కేస్ వేశారు నిర్మాత కిరణ్‌. డిసెంబర్ 9లోగా వ్యూహం సెన్సార్ వ్యవహారాన్ని పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో డిసెంబర్ 1న ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా చూస్తామని రివైజ్డ్ కమిటీ చిత్ర బృందానికి సమాచారం ఇచ్చింది. ఇక అంతా సాఫీగా జరుగుతుందని ఆశించిన వర్మకు మళ్లీ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 4న బెంగళూర్‌లో రివైజ్డ్ కమిటీ చూస్తుందని చెప్పారట. తెలుగు సినిమాను కన్నడ సెన్సార్ బోర్డు ఎలా చూస్తుంది? ఎలా సర్టిఫై చేస్తుందని వర్మ అంటున్నట్టు తెలిసింది.

Exciting exit polls : కాక రేపుతున్న ఎగ్జిట్‌ పోల్స్‌.. రాజకీయ నాయకుల్లో నరాలు తెగే టెన్షన్‌..

అయినా చేసేదేమీ లేక బెంగళూరు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు. ఇది జరుగుతున్న కథ. దీని బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమా.. పైగా వర్మలాంటి డైరెక్టర్ చేతి నుంచి వచ్చేది కావడంతో టీడీపీ అలెర్ట్ అయి కేంద్ర సమాచార ప్రసార శాఖకు కంప్లైంట్ ఇచ్చిందట. ఆ ఫిర్యాదుతోనే వ్యూహం చిక్కుల్లో పడిందని సమాచారం. సాధారణంగా జరిగిపోవాల్సిన సెన్సార్ సమస్యాత్మకంగా మారిపోయిందట. రివైజ్డ్ కమిటీ ముందు సినిమా ప్రదర్శనకే రెండు డేట్లు.. రెండు చోట్లు మారడంతో క్లియరెన్స్ అంత వీజీ కాదేమోననే ఆందోళన చిత్ర నిర్మాణ సంస్థలో ఉందట. దాదాపు 25కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంది. రెండో భాగాన్ని శపథం పేరుతో తీస్తారట వర్మ. అందులో జగన్ సీఎం అయిన తర్వాత నుంచి కథ మొదలవుతుందని సమాచారం. మొదటి భాగానికే ఇన్ని కష్టాలు వచ్చాయి.

ఇక రెండో భాగం సంగతి ఏంటోననే టెన్షన్ నిర్మాతకు పెరుగుతోందంటున్నారు. ఎన్నికలు లేకుండానే ఏపీ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది. మరి సెన్సార్ రివైజ్ఢ్ కమిటీ నుంచి క్లియరెన్స్ వస్తుందా.. లేదంటే మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా అనే డౌట్ కూడా ఉన్నట్టు తెలిసింది. రాజకీయాల మీద, రాజకీయ నేతల మీద వర్మ ఇప్పటి వరకు డజనకుపైగానే సినిమాలు తీశారు. వాటిలో కూడా వివాదం అయినవీ ఉన్నా… సెన్సార్ సమస్యల్లో చిక్కుకోలేదు. మరి వ్యూహం ఏం అవుతుందో చూడాలి.