1000 కోట్ల రిచ్ కమెడియన్.. ఫామ్ లో లేకున్నా ఇవేం పొగడ్తలు.?

బ్రహ్మానందం వెయ్యికి పైనే సినిమాల్లో కమెడియన్ గా కనిపించాడు. ఇది మనకు కొత్తకాదు కాని, వరల్డ్ వైడ్ గా ఒకే వ్యక్తి ఇన్ని సినిమాల్లో కమెడియన్ గా కనిపించటం అద్భుతమే.. అందుకే గిన్నిస్ బుక్ వాళ్లు ఎప్పుడో బ్రహ్మిని రికార్డుల్లోకి ఎక్కించేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 9, 2023 | 05:21 PMLast Updated on: Jun 09, 2023 | 5:21 PM

Richest Comedian Bramhanadnam

కట్ చేస్తే ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ కమెడియన్ గా బ్రహ్మానందం పేరు మారుమోగుతోంది. ఒక మూడేళ్ల క్రితం వరకు ఏ సినిమాలోచూసినా బ్రహ్మానందమే మెరిశాడు. తనులేంది సినిమాలేదనే పరిస్థితి. కాని బైపాస్ సర్జరీ తర్వాత బ్రహ్మానందం చాలా అరుదుగా సినిమాలు చేస్తున్నాడు.

సో ఏడాదికి 30 ,40 సినిమాలు చేసినప్పుడు బ్రహ్మానందంని రిచ్ కమెడియన్ అని ఎవరనలేదు. సినిమాకు కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటున్నప్పుడు రిచ్ కమెడియన్ అనలేదు. ప్రజెంట్ ఏడాదికి ఒకటి.. రెండు సినిమాలు చేస్తుంటే మాత్రం ఇండియాస్ రిచ్చెస్ట్ కమెడియన్ అంటున్నారు. దానికి కారణం తన ఆదాయాన్ని మించేలా ఆస్తుల విలువ పెరగటం. తన ఇల్లు, రెంటల్ కాంప్లెస్ట్ లు, అలానే తన పేరు మీదున్న పొలాలు, ఫామ్ హౌజ్ అన్నీటి విలువ 350 కోట్లు ఉంటుందట. ఇక 5 ఏళ్ల క్రితం తీసుకున్న 120 ఎకరాల ఎస్టేట్ విలువ 700 కోట్లకు పెరిగిందని, అలా చూస్తే వెయ్యికోట్ల పైనే ఆస్తులున్న రిచ్ కమెడియన్ బ్రహ్మానందం అంటున్నారు. అలా తన పేరు ఇప్పుడు వార్తల్లో నానుతోంది.