Rishab Shetty: రిషబ్ శెట్టి ఖాతాలో మరో రికార్డ్

శాండిల్ వుడ్ తో సహా రిలీజైన అన్ని భాషల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది కాంతార సినిమా. ప్రస్తుతం ఈ మూవీ పార్ట్ 1 నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు ప్రేక్షకులు చూసింది కాంతార పార్ట్ 2.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2023 | 07:15 PMLast Updated on: Feb 21, 2023 | 7:15 PM

Rishab Shetty Creating Another Record

రిషబ్ శెట్టి. ఈ కన్నడ స్టార్ డైరెక్టర్ పేరు కేవలం బెంగళూరులోనే కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో, ముంబైలో కూడా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే కాంతార మూవీతో రిషబ్ శెట్టి సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లో కాంతార సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవర్ నైట్లో రిషబ శెట్టిని ప్యాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక తెలుగు ఆడియన్స్ అయితే.. రిషబ్ శెట్టి కంటే కాడబెట్టు శివనే ఎక్కువగా గుర్తుంచుకున్నారు. ఆ రేంజ్ లో తన పాత్రలో రిషబ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ హీరోలతో సమానంగా తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు రిషబ్. ఇప్పుడు ఇదే కాంతార మూవీ రిషబ్ కు మరో గౌరవం తెచ్చిపెట్టింది. కాంతార సినిమాకు గాను మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా రిషబ్ శెట్టికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించింది.

తనకు దక్కిన ఈ గౌరవాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు రిషబ్ శెట్టి. చాలా తక్కువ మందికి మాత్రమే దక్కే ఈ గౌరవం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందంటూ థాంక్స్ నోట్ పెట్టాడు. ఈ అవార్డ్ తనకు రావడానికి కాంతార ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ముఖ్య కారణమంటూ రాసుకొచ్చాడు. తనను నమ్మి కాంతార లాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. తన టీం సహాయం లేకుండా కాంతార సినిమా ఇంత గొప్ప విజయం సాధించేది కాదన్నాడు. వాళ్లందరి కృషి వల్లే తాను ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును దక్కించుకోగలిగానన్నాడు. కాంతార టీంలో ప్రతీ ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీసేందుకు ఈ అవార్డ్ ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందంటూ ట్రోఫీతో తీసున్న ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.

ఓ సామాన్య చిత్రంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన కాంతార మూవీ.. రిలీజ్ అయిన తరువాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కర్ణాటకలోని కరావళి ప్రాంతపు ప్రాచీన కళారూపాలకు, సంస్కృతికి, జీవన విధానానికి వెండితెరపై జరిగిన అభిషేకం కాంతార సినిమా అంటూ కొందరు సినీ క్రిటిక్స్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. ప్రాచీన సాంప్రదాయమైన భూత కోళను, ప్రకృతితో గ్రామీణ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని కాంతారా సినిమాలో చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. సినిమా నిర్మాణం కన్నడ బాషలో జరిగినప్పటికీ.. తరువాత తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో డబ్ చేశారు. శాండిల్ వుడ్ తో సహా రిలీజైన అన్ని భాషల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది కాంతార సినిమా. ప్రస్తుతం ఈ మూవీ పార్ట్ 1 నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు ప్రేక్షకులు చూసింది కాంతార పార్ట్ 2 అని.. దీని ప్రీక్వెల్ త్వరలో రాబోంతోందని మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన కాంతాకా ఖాతాలో మరో కలికితురాయి చేరడం సంతోషంగా ఉందంటున్నారు ఈ మూవీ లవర్స్.