Kantara 2: కాంతార-2లో కొత్త లుక్‌లో కనిపించబోతున్న రిషబ్‌ షెట్టి.. 11 కేజీల బరువు తగ్గిన నటుడు..!

కాంతార మొదటి పార్ట్‌తో కంపేర్‌ చేస్తే కాంతారా ప్రీక్వెల్‌ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్‌లో కూడా చాలా మార్పులు ఉంటాయట. రిషబ్‌ షెట్టి తానే దర్శకత్వం చేస్తూ.. తానే హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం లుక్‌ మొత్తం మార్చేయబోతున్నాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 15, 2023 | 05:03 PMLast Updated on: Sep 15, 2023 | 5:03 PM

Rishab Shetty Loses 11 Kgs For Kantara 2 Undergoes Major Physical Training For His Role

Kantara 2: కన్నడతో పాటు తెలుగు, హిందీలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన కాంతారా సినిమా ప్రీక్వెల్‌ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసిన మేకర్స్‌ త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట. కాంతార మొదటి పార్ట్‌తో కంపేర్‌ చేస్తే కాంతారా ప్రీక్వెల్‌ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్‌లో కూడా చాలా మార్పులు ఉంటాయట.

రిషబ్‌ షెట్టి తానే దర్శకత్వం చేస్తూ.. తానే హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం లుక్‌ మొత్తం మార్చేయబోతున్నాడట. కథలో క్యారెక్టర్‌కు తగ్గట్టుగా ఉండేందుకు డైట్‌ చేసి ఏకంగా 11 కిలోలు బరువు తగ్గాడట. కాంతార కంటే ముందు కథలో ఏం జరిగింది అనే విషయాన్ని కాంతారా ప్రీక్వెల్‌లో చూపించబోతున్నారు. కాంతార సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పుడు ప్రీక్వెల్‌ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు రిషబ్‌ కూడా కొత్త లుక్‌లో కనిపించేందుకు వెయిట్‌ తగ్గడంతో సినిమా మీద మరింత క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్‌ మాత్రమే పూర్తైంది.

త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధిచిన వివరాలు త్వరలోనే అందిస్తామని చెప్తున్నారు మూవీ టీం. డైరెక్షన్‌తో పాటు యాక్షన్‌ ఇరగదీసిన రిషబ్‌.. ఇప్పుడు వెయిట్‌ తగ్గి కొత్త లుక్‌లో ఎలాంటి విశ్వరూపం ప్రదర్శించాడో చూసేందుకు ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.