ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. కాంతార నటుడికి దేవుడు పంపిన హెచ్చరిక..!
ఇండస్ట్రీలో ఒకే ఒక సినిమా చాలు ఇండియా మొత్తం తెలియడానికి. అలా తెలిసిన హీరో రిషబ్ శెట్టి.. తెలిసేలా చేసిన సినిమా కాంతార. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా 400 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇండస్ట్రీలో ఒకే ఒక సినిమా చాలు ఇండియా మొత్తం తెలియడానికి. అలా తెలిసిన హీరో రిషబ్ శెట్టి.. తెలిసేలా చేసిన సినిమా కాంతార. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే. కర్ణాటకలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భూత కోలా అనే సాంప్రదాయం చుట్టూ కాంతార సినిమా కథ తిరుగుతుంది. కేవలం 18 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే ఏకంగా 400 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు రిషబ్. కాంతార 2 కోసం 200 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడి కుటుంబానికి ఆ దేవుడు నుంచి ప్రమాద హెచ్చరిక వచ్చింది. నమ్మడానికి కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది కానీ ఇదే నిజం.
కర్ణాటకలో ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో దేవుడిని బలంగా నమ్ముతారు.. ఆయనే వచ్చి మాట్లాడినట్టు వాళ్ళు ఊహించుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పంజుర్లి గ్రామ దేవతను కుటుంబంతో సహా దర్శించుకున్నాడు రిషబ్ శెట్టి. తన సినిమాలు చూపించిన చాలా సన్నివేశాలు సొంత గ్రామంలో జరిగినవి. చిన్నప్పటినుంచి తాను చూసిన ఎన్నో సాంప్రదాయాలను కాంతార సినిమాలో చూపించాడు రిషబ్. ఈ డివోషనల్ డ్రామాలో చూపించిన ఎన్నో సన్నివేశాలు ఇప్పటికి కూడా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ సినిమాకు కన్నడ ఆడియన్స్ ఇంతగా కనెక్ట్ అయ్యారు. అంతా బాగానే జరుగుతున్న ఈ సమయంలో ఈ నటుడికి అనుకోని షాక్ తగిలింది. ఈ మధ్యే మంగళూరులోని పంజుర్లి దేవస్థానాన్ని సందర్శించాడు రిషబ్ శెట్టి. ప్రతి సంవత్సరం ప్రత్యేక దినాన ఉదయం 11 నుంచి మరుసటి రోజు తెల్లవారుఝాము 4 గంటల వరకు జరిగే వేడుకలో భాగం పంచుకున్నాడు. ఆయన కుటుంబం కూడా ఇందులో పాల్గొన్నారు. ఇది కద్రి బరిబైల్ అనే ప్రాంతంలో జరుగుతుంది. పండగ చివరిలో రిషబ్ శెట్టితో పంజుర్లి పూనిన పూజారి మాట్లాడుతూ.. కొన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేశాడు. అది విన్న తర్వాత అక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు అభిమానులు కూడా చాలా కంగారు పడ్డారు.
ఎందుకంటే కర్ణాటకలో ఇప్పటికీ వీటిని బలంగా నమ్ముతారు కాబట్టి ఆ పూజారి చెప్పిన మాటలు విన్న తర్వాత రిషబ్ శెట్టి ని అందరూ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ పూజారి దేవుడు ఆవహించిన తర్వాత ఏం చెప్పాడో తెలుసా.. నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు.. నీకు తెలియకుండానే భారీ కుట్రకు తెర తీశారు.. నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అంటూ హామీ ఇచ్చాడు. వారాహి పంజుర్లి నోటి వెంట వచ్చిన ఈ వాక్కులు విని అక్కడున్న వాళ్లు భయంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి రిషబ్ కాంతార పార్ట్ 1 తీస్తున్నపుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. కాకపోతే అప్పుడు ఈ సినిమా అంత పాపులర్ కాలేదు కాబట్టి అవన్నీ బయటికి రాలేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఏ చిన్న విషయం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. బెంగళూరు దగ్గర్లోని షూటింగ్ ప్రాంతంలో పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారని స్వయంగా అటవీ శాఖా మంత్రి చర్యలకు పూనుకోవడం అప్పట్లో సంచలనం రేపింది.
చిత్రీకరణ సమయంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వాడారని ప్రభుత్వానికి కంప్లయింట్స్ ఈ సినిమా యూనిట్ మీద వచ్చాయి. అంతేకాదు షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి కొంతమంది చిత్ర యూనిట్ గాయపడ్డారు. ఇవన్నీ టీమ్ ను బాగా కంగారుపెట్టాయి. పార్ట్ 2 విషయంలో అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాడు దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడు పంజూర్లి పూజారి నోటి నుంచి వచ్చిన హెచ్చరిక చూసిన తర్వాత అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది. అక్టోబర్ 2 విడుదల ప్లాన్ చేసుకున్న కాంతార చాప్టర్ 1ను అనుకున్న సమయానికి విడుదల చేయాలనే లక్ష్యంతో రిషబ్ శెట్టి చాలా కష్టపడుతున్నాడు. మరి దేవుడు పంపిన హెచ్చరిక కాంతార సినిమా హీరో మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.