విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదనుకున్నా.. ఆ హీరోయిన్ ఏంటి అంత మాటనేసింది..!
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ అందరికంటే ముందు ఉంటాడు. అప్పుడెప్పుడో పెళ్లిచూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి అంటూ కెరీర్ మొదట్లో హిట్లు కొట్టాడు

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ అందరికంటే ముందు ఉంటాడు. అప్పుడెప్పుడో పెళ్లిచూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి అంటూ కెరీర్ మొదట్లో హిట్లు కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పటివరకు ఒక విజయం కూడా అందుకోలేదు. కాకపోతే అప్పుడు వచ్చిన ఇమేజ్ ఇంకా కాపాడుకుంటూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ రావడం లేదు. రెండేళ్ల కింద ఖుషి సినిమా మాత్రం పర్లేదు అనిపించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు దారుణంగా నిరాశపరచడంతో విజయ్ కెరీర్ ప్రస్తుతం కాస్త డైలమాలో ఉంది.
విజయ్ దేవరకొండ కెరీర్ మీద ఇప్పుడు ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో విజయ్ ని చూసి నిజంగా అంత పెద్ద హీరో అవుతాడు అని అసలు అనుకోలేదు అన్నారామే. రౌడీ హీరో మీద కామెంట్ చేసిన ఆ బ్యూటి ఎవరో కాదు పెళ్లిచూపులు హీరోయిన్ రితు వర్మ. మజాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీతూ చేసిన కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లిచూపులు సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. అందరం కలిసి సరదాగా ఫ్రెండ్స్ లా ఆ సినిమా చేశాము.. పెద్దగా బడ్జెట్ ఏమీ లేదు.. కానీ రిలీజ్ అయిన తర్వాత అందరి జీవితాలను ఆ సినిమా మార్చేసింది అని తెలిపింది రీతూ.
ఇక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆ సినిమా టైంలో విజయ్ ను చూసి ఇంత పెద్ద హీరో అవుతాడని అసలు అనుకోలేదన్నారు. సిన్సియర్ గా వర్క్ చేస్తాడు.. కెరీర్ గురించి బాగా కష్టపడతాడు.. కచ్చితంగా సక్సెస్ అవుతాడు అని అనుకున్నాను కానీ మరీ ఇంత పెద్ద హీరో అవుతాడని అసలు ఊహించలేదు అని చెప్పింది రీతు వర్మ. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ఆయనను కలవలేదని.. ఒకవేళ కలిసినా మళ్లీ అదే పలకరింపు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటుంది రీతూ. ఏదేమైనా రౌడీ బాయ్ గురించి ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి.