రాబిన్ హుడ్ ట్రైలర్.. ఎంటర్టైన్మెంట్ దొంగ.. డేవిడ్ వార్నర్ ఎలా ఉన్నాడో తెలుసా..?

నితిన్ ఆశలన్నీ ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా మీదే ఉన్నాయి. ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు.. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 11:45 AMLast Updated on: Mar 24, 2025 | 11:45 AM

Robin Hood Trailer Release

నితిన్ ఆశలన్నీ ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా మీదే ఉన్నాయి. ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు.. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఎందుకంటే అప్పుడెప్పుడో కరోనా రాకముందు భీష్మ సినిమాతో హిట్టు కొట్టాడు నితిన్. ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేసినా కూడా ఒకటి కూడా కలిసి రాలేదు. చివరికి చేసేది ఏమీ లేక మళ్ళీ అదే డైరెక్టర్ తో రాబిన్ హుడ్ సినిమా చేశాడు నితిన్. రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత వెంకీ కుడుముల నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే చాలా సార్లు వాయిదా పడి ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి క్రేజీ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న కూడా చాలా వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంది రాబిన్ హుడ్. చివరికి అన్నీ క్లియర్ చేసుకొని మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేకర్స్ చేస్తున్న ప్రమోషన్ సినిమా మీద ఆసక్తి క్రియేట్ చేస్తుంది.

ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు హీరో నితిన్ అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. వాళ్లకు శ్రీలీల కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ముగ్గురు కలిసి ఎక్కడ తగ్గేది లే అంటూ ప్రమోషనల్ కంటెంట్ ఇరగదీస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత అంచనాలు డబుల్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ మొత్తం కేవలం కామెడీ మీదే ఫోకస్ చేశాడు దర్శకుడు వెంకీ. మధ్య మధ్యలో స్టోరీ రివిల్ చేయాలని చూసినా కూడా.. మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కామెడీ మీదే పెట్టాడు. నితిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ మధ్యలో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. భీష్మ సినిమాలో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పిన వెంకీ కుడుముల.. ఈ సినిమాలో కూడా ఒక సోషల్ ఇష్యూ తీసుకున్నాడని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని పూర్తిగా ఎంటర్టైనింగ్ పద్ధతిలో ఇస్తున్నాడు వెంకీ.

ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే.. చివరి షాట్ లో డేవిడ్ వార్నర్ అలా హెలికాప్టర్ నుంచి దిగుతూ నడిచొచ్చే షార్ట్ మరో ఎత్తు. ఈ సినిమాలో దాదాపు పది నిమిషాలు ఉండే అతిథి పాత్ర చేశాడు డేవిడ్ వార్నర్. దీనికోసం ఆయనకు దాదాపు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కచ్చితంగా రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ బాయ్ కామియో హెల్ప్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఆయన వల్ల కలెక్షన్స్ కూడా పెరుగుతాయని వాళ్ల నమ్మకం. ట్రైలర్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ సినిమా వాళ్ళ చేతుల్లో ఉందని అర్థమవుతుంది. మరి ఇంతే ఎంటర్టైన్మెంట్ రేపు థియేటర్లో కూడా ఇస్తే సినిమాకు తిరుగుండకపోవచ్చు. ఈ సినిమాకు పోటీగా లూసిఫర్ 2, వీర వీర సూరన్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు కూడా ఈ వీకెండ్ రాబోతున్నాయి. ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ భారీగా ఉండబోతుంది. మరి వాళ్ళని తట్టుకొని రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ను దోచుకుంటాడా లేదా అనేది మార్చి 28న తేలనుంది..!