రోజా షాకింగ్ డెసిషన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ.. హీరో ఎవరంటే
సినిమాలతో పాపులరై రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు
![రోజా షాకింగ్ డెసిషన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ.. హీరో ఎవరంటే Rojas Shocking Decision Re Entry Into Movies Who Is The Hero](https://s3.ap-south-1.amazonaws.com/media.dialtelugu.com/wp-content/uploads/2025/02/OGXEWEGLU3E-HD.jpg)
సినిమాలతో పాపులరై రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉండి కొంతమంది సినిమాలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పేసారు. అందులో వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఒకరు. సినిమాల ద్వారా సమాజంలో పాపులర్ అయిన ఆర్కే రోజా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు.
అయితే ఇప్పుడు మళ్లీ రోజా సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక పవర్ఫుల్ రోల్ ఆమెకు రావడంతో సినిమాలో నటించేందుకు రోజా రెడీ అయ్యారు. అయితే ఇది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా.. తమిళ స్టార్ డైరెక్టర్ రోజాకు ఒక మంచి పాత్ర ఇవ్వటంతో ఆమె చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. రాజకీయాల కారణంగా కొన్నాళ్ల నుంచి సినిమాలు వైపు చూడని రోజా ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయ్యారు. పెద్దగా విమర్శలు కూడా చేసేందుకు ఇష్టపడటం లేదు.
ఆమెకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ కొన్ని షోస్ కూడా రోజా చేశారు. దీనితో ఆమెకు… ఒక మంచి రోల్ ఇచ్చేందుకు ఒక డైరెక్టర్ రెడీ అయినట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో రోజా విశాల్ కు తల్లిగా నటిస్తోంది. అప్పుడెప్పుడో తెలుగులో ఒక సినిమాలో కనపడిన రోజా మళ్లీ ఆ తర్వాత మేకప్ వేసుకోలేదు. రాజకీయాల్లో మాత్రమే ఆమె మీడియాలో కనబడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సినిమా ఆఫర్ రావడంతో ఈ సినిమా కోసం రోజా కష్టపడుతున్నారు.
ఏపీలో రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉండటంతో ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నట్లు సమాచారం. ఇక ఆమె భర్త డైరెక్ట్ చేయబోయే ఒక సినిమాలో కూడా రోజా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తన కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న రోజా… ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆమె కుమార్తె విదేశాల్లో చదువుకుంటున్నారు. ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చి సినిమాలో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలుగులో రోజాకు పెద్దగా అవకాశాలు రావటం లేదు. మొన్నామధ్య సినిమాల్లో నటించడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపించినా పెద్దగా డైరెక్టర్లు గాని, నిర్మాతలు గాని ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. రోజా తెలుగులో ఎంత ఫేమస్ అయ్యారో… తమిళంలో కూడా అంతే ఫేమస్. ఈ టైంలో ఆమె అక్కడ నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం మంచి ఆఫర్ రావడం కాస్త ఆమె అభిమానులను ఖుషీ చేస్తోంది.