valentine day special: ప్రేమ వర్షం.. వాలెంటైన్స్ డే స్పెషల్.. తిరిగొస్తున్న ప్రేమకథలు

పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి నటించిన తొలిప్రేమ, మృణాల్, దుల్కర్‌ నటించిన సీతా రామం, సిద్దార్ధ్, షామిలి ఓయ్, సూర్య, సమీరా నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, లేటెస్ట్ సంచలనం బేబీ లాంటి సినిమాలు మరోసారి ప్రేమికుల కోసం రేపు థియేటర్స్‌లో సందడి చెయ్యనున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 04:44 PMLast Updated on: Feb 13, 2024 | 4:44 PM

Romantic Tollywood Love Story Movies Releasing On Valentines Day

valentine day special: ఎలాంటి స్వార్ధం .. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇద్దరు యువతీ యువకుల మధ్య ఏర్పడే పవిత్రమైన గుండె చప్పుడే ప్రేమ. ఆ ప్రేమ తమతో ఉంటే చాలు.. ఇంక జీవితంలో తమకి ఏమి అక్కర్లేదని నిత్యం ఎంతో మంది ప్రేమ కోసం పరితపిస్తు ఉంటారు. ప్రేమకి ఉన్న శక్తి ముందు విధాత కూడా ప్రేమికులకి చిన్నవాడిలాగా కనిపిస్తాడు. అసలు ఈ సృష్టిలో పురుడుపోసుకున్న ఏ ప్రాణి అయినా సరే తమ జీవితంలో ఏదో ఒక చోట ప్రేమని అనుభవించే ఉంటుంది.

Pushpa 2: పుష్ప రచ్చ.. సింహంతో సుకుమార్

ప్రేమ లేని ఆరంభం లేదు.. ప్రేమలేని అంతం లేదు. కనుకనే ప్రేమ నిత్యం తన గెలుపు కోసం సంచరిస్తూనే ఉంటుంది. అందుకే కాబోలు తెలుగు సినిమా పుట్టినప్పటి దగ్గరనుంచి ఎన్నో ప్రేమ కథలు తెరెకెక్కుతూనే వస్తున్నాయి. ఆ మాటకొస్తే ప్రేమ లేని సినిమానే ఉండదు. రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ తాలూకు స్పర్శని మరోసారి తెలియచెయ్యడానికి 10 సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి నటించిన తొలిప్రేమ, మృణాల్, దుల్కర్‌ నటించిన సీతా రామం, సిద్దార్ధ్, షామిలి ఓయ్, సూర్య, సమీరా నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, లేటెస్ట్ సంచలనం బేబీ లాంటి సినిమాలు మరోసారి ప్రేమికుల కోసం రేపు థియేటర్స్‌లో సందడి చెయ్యనున్నాయి.

వీటితో పాటు ప్రేమ అజరామరం అని చాటి చెప్పిన ఇతర భాషా చిత్రాలు టైటానిక్, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, జబ్ వుయ్ మెట్, వీర్ జరా, మొహబ్బతేలు కూడా ప్రేమికుల కోసం వెల్‌కమ్ చెప్తున్నాయి. ఇలా తెలుగు, ఇతర భాషా సినిమాలు కలిపి మొత్తం పది సినిమాలు రేపు హైదరాబాద్ నగరాన్ని ప్రేమ వర్షంలో ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రేమ సినిమాల రిలీజ్‌తో ప్రేమ అనే పదం ఎంత శక్తివంతమైనదో మరోసారి అందరికి అర్ధం అయింది. అలాగే ప్రేమకి మరణం ఉండదనేది ఎంత నిజమో.. ప్రేమ సినిమాలని మరణం ఉండదు అనే నిజం కూడా అందరికి అర్ధం అయ్యింది.