The Diary of West Bengal: నిన్న ది కేరళ స్టోరీ.. నేడు ది డైరీ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌.. కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతున్న దర్శకులు

రెగ్యులర్‌గా వచ్చే నార్మల్‌ స్టోరీలు స్క్రీన్‌ప్లే ఎంతబాగున్నా యావరేజ్‌గా కూడా ఆడటంలేదు. అదే ఒక పురాతన కథో లేక కాంట్రవర్షియల్‌ లైన్‌ ఆధారంగానో సినిమా తీస్తే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతున్నాయి. ఇక రియల్‌ ఇన్సిడెంట్‌ బేస్‌గా సినిమాలు తీస్తే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. రీసెంట్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ సినిమానే దీనికి ఎగ్జాంపుల్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2023 | 05:07 PMLast Updated on: May 27, 2023 | 5:07 PM

Row Over The Diary Of West Bengal Film It Will Became Another The Kerala Story

The Diary of West Bengal: కొంత కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో ట్రెండ్‌ మారిపోయింది. ఆడియన్స్‌ సినిమాను రిసీవ్‌ చేసుకునే పద్ధతి కూడా మారిపోయింది. రెగ్యులర్‌గా వచ్చే నార్మల్‌ స్టోరీలు స్క్రీన్‌ప్లే ఎంతబాగున్నా యావరేజ్‌గా కూడా ఆడటంలేదు. అదే ఒక పురాతన కథో లేక కాంట్రవర్షియల్‌ లైన్‌ ఆధారంగానో సినిమా తీస్తే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతున్నాయి. ఇక రియల్‌ ఇన్సిడెంట్‌ బేస్‌గా సినిమాలు తీస్తే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. రీసెంట్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ సినిమానే దీనికి ఎగ్జాంపుల్‌.

కేరళలో జరిగిన లవ్‌ జిహాదీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వచ్చింది. సినిమాను ఆపేందుకు ఎంతలా ట్రై చేశారో సినిమా అంతే రేంజ్‌లో హిట్‌ అయ్యింది. ఇప్పటికే 217 కోట్లు కలెక్ట్‌ చేసింది. సినిమా కలెక్షన్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అదే స్టైల్‌లో ది డైరీ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ అనే సినిమా వస్తోంది. డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెస్ట్‌ బెంగాల్‌లో పాలిటిక్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. బెంగాల్‌లో జరిగిన హిందువుల సామూహిక హత్యలు, అత్యాచారాలు ట్రైలర్‌లో చూపించారు. అచ్చం ది కేరళ స్టోరీ లాగే ది డైరీ ఆఫ్ వెస్ట్‌ బెంగాల్‌ సినిమా కూడా ట్రైలర్‌తోనే వివాదంలో చిక్కుకుంది. సినిమాలో బెంగాల్‌ ప్రతిష్టను దిగజార్చేలా సీన్స్‌ ఉన్నాయంటూ అక్కడి ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

సినిమా డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రాకు సమన్లు జారీ చేశారు పోలీసులు. మే 30న విచారణకు రావాలంటూ ఆదేశించారు. అయితే సినిమాలో తాను చూపించిన అన్ని సంఘటనలకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాలున్నాయంటున్నారు డైరెక్టర్‌ సనోజ్‌. సినిమాలో ఏదీ దురుద్దేశంతో తీసిన సీన్‌ కాదంటున్నారు. నిజం మాట్లాడితే ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరుతున్నారు. కేరళ స్టోరీని ఆపినట్టుగానే తన సినిమాను కూడా ఆపేందుకు బెంగాల్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటున్నారు. కేరళ స్టోరీ విషయంలో కూడా ఇదే జరిగింది. చాలా ప్రాంతాల్లో సినిమాను ఆపాలని చూశారు.

కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు చేశారు. కానీ సినిమా మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రికార్డ్‌ చెదిరిపోయే కలెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు బెంగాల్‌ ప్రభుత్వం ఆపాలని చూస్తే ది డైరీస్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ కూడా మరో కేరళ స్టోరీ అయ్యే చాన్స్‌ ఉంది.