Vijay Devarakonda: తెలుగు డైరెక్టర్స్ వేస్ట్ అనుకున్నాడా.. అందుకే తమిళ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారా..?
ఎంత పెద్ద స్టార్ అయినా.. ప్లాప్స్ పడినప్పుడు జాగ్రత్త పడాలి. స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్న రౌడీ స్టార్ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.

Rowdy hero Vijay Devara Konda said that he is going to make a film with Tamil directors
ఎంత పెద్ద స్టార్ అయినా.. ప్లాప్స్ పడినప్పుడు జాగ్రత్త పడాలి. స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్న రౌడీ స్టార్ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంతకీ లైగర్ తో సినిమా చేసే ఆ తమిళ్ డైరెక్టర్ ఎవరు? ‘లైగర్’ ప్లాప్ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తన మార్కెట్ పరిధి పెంచే కథలకే ఓకే చెబుతున్నాడు.ప్రజెంట్ శివ నిర్వణా డైరెక్షన్ లో ఖుషి మూవీ చేసిన విజయ్ ఈ ప్రాజెక్ట్ ని సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఒకటి, పరశురామ్ తో మరో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.ఇవి కంప్లీట్ కాకముందే ఓ తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రౌడీ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఖుషి ప్రమోషన్ లో భాగంగా చెన్నై వెళిన విజయ్ తమిళ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్ట్ ఫిలిం ఉంటుందా? అని రిపోటర్ ప్రశ్నించగా తమిళ్ దర్శకుడితో సినిమా ఓకే అయ్యింది. కానీ అది తెలుగులో డైరెక్ట్ చేస్తారా? లేక తెలుగు,తమిళంలో బైలింగువల్ గా తెరకెక్కిస్తారా ? అనేదాని పై క్లారిటీ రావల్సి ఉంది అని పేర్కోన్నాడు. దీంతో విజయ్ దేవరకొండ ఏ తమిళ్ దర్శకుడితో వర్క్ చేయబోతున్నాడని తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్ .
రౌడీ స్టార్ తో సినిమా చేయడానికి 4 గురు తమిళ్ దర్శకులు పోటీ పడుతున్నారు. ఇందులో అరుణ్ మాథేశ్వరన్ ,గౌతమ్ మీనన్, పా రంజిత్ , వెట్రిమారన్ ఉండటం విశేషం.ఇందులో ఒక డైరక్టర్ విజయ్ ని కలిసి బైక్ చుట్టూ తిరిగే కథను చెప్పాడట. స్టోరీ నచ్చడంతో విజయ్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఓకే చెప్పడట. అయితే ఏ డైరెక్టర్ కి ఈ ఛాన్స్ ఇచ్చాడో అనేది సస్పెన్స్.