Pawankalyan: పవర్‌స్టార్ సినిమాలో రౌడీ ?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవర్‌స్టార్ ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

pawan kalyan devarakondapawan kalyan devarakonda
డిఫరెంట్ లుక్‌లో పవన్ కనిపించడంతో.. సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్న ఈ సినిమాలో ఇప్పుడు ఓ యంగ్ హీరో జాయిన్ కాబోతున్నాడట. అతనే టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో పవన్ అనుచరిడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట. స్టోరీలో విజయ్ రోల్ చాలా కీలకంగా ఉండబోతోందట. హరిహరవీరమల్లులో ఇప్పటికే బాబీ డియోల్, నోరా ఫతేహి లాంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు విజయ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు అని తెలియడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతాయి.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగాడు. తక్కువ టైంలోనే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. టాలీవుడ్ వర్గాల్లో మాత్రం డిస్కర్షన్ గట్టిగానే జరుగుతోంది. ఈ గాసిప్ గురించి హరిహరవీరమల్లు టీం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.