Vijay Deverakonda : తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రౌడీ
లైగర్ (Liger) సినిమాతో పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత చేసిన ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

Rowdy is doing his job
లైగర్ (Liger) సినిమాతో పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత చేసిన ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా కోసం దిల్ రాజు (Producer Dil Raju), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేశారు. కానీ సినిమా టాక్ మాత్రం కాస్త తేడా కొట్టేసింది. ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ (Family Audios) నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. కలెక్షన్స్ పరంగా అంచనాలు అందుకోలేకపోయింది.
ఇక గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ స్టార్ (Family Star) తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.ఇప్పటికే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు విజయ్. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. గతంలోనే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ జరిగింది. కానీ ఫ్యామిలీ స్టార్ కారణంగా ఆపేశారు.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీలో రౌడీ బాయ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. కానీ ఇప్పుడు శ్రీలీల తప్పుకున్నట్టు సమాచారం. ఆమె ప్లేస్‌లో మమిత బైజు, భాగ్యశ్రీ భోర్సే.. పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాతో రౌడీ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి.