Anasuya Vs Vijay Devarakonda: రౌడీ స్టార్ వర్సెస్ అనసూయ.. కేసులు పెట్టేవరకు సీన్ మారిందా..?
విజయ్ దేవరకొండ ఏం చేసినా ఏదోలా కెలికి కయ్యానికి కాలుదువ్వుతోంది అనసూయ అనేది ఫ్యాన్స్ నుంచి వస్తోన్న కంప్లైంట్. ఐతే అర్జున్ రెడ్డి టైం నుంచే రౌడీని టార్గెట్ చేసిన అనసూయ, విజయ్ మీద విమర్శలు పెంచటానికి అసలు కారణాలు తెలిసిపోయాయి.

Anasuya Vs Vijay Devarakonda
ఆ వివారాల్లోకి వెళ్లే ముందు, ఎక్స్ క్లూజివ్ గా అందిన సమాచారం ప్రకారం, అనసూయ వ్యవహరం మా అసోసియేషన్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడట విజయ్ తమ్ముడు ఆనంద్. నిర్మాతల కౌన్సిల్ తోపాటు మెగాస్టార్ చిరుని కలిసే ప్రయత్నం కూడా చేయబోయడట. ఐతే రౌడీస్టారే ఆపాడని అంతర్గత సమాచారం.
ఇక అనసూయ కూడా తనని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న విజయ్ ఫ్యాన్స్ మీద సైబర్ పోలీసుల ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటోందట. ఐతే ఇంతగా విజయ్ ని అనసూయ టార్గెట్ చేయటానికి అర్జున్ రెడ్డిలో అన్న బూతు పదం మాత్రమే కారణం కాదట. మీకు మాత్రమే చెబుతా సినిమాలో అనసూయకి ఎక్కువ సీన్లు పెట్టి, తర్వాత ఎడిటింగ్ లో చాల వరకు తీసేశారని , అప్పటి నుంచి ఆ మూవీ నిర్మాత అయిన విజయ్ తో తనకి గొడవలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇదే కాదు అసలు గొడవకి మరోకారణం, అనసూయతో భర్త భరద్వాజ ఓసారి గొడవకు దిగాడట. ఏదో పార్టీలో లైగర్ ప్లాప్ గురించి నోరు జారిన భరద్వాజని భార్య సంపాదనతో బతికే వ్యక్తంటూ విజయ్ కూడా ఫైర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది మనసులో పెట్టుకునే విజయ్ ఫ్యాన్స్ మండిపడతారని తెలిసి కూడా అనసూయ ఇలా రియాక్ట్ అవుతోందనంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే ఇదే మరో హీరో అయితే అనసూయ ఇలా ట్వీట్లు చేసేదా? బ్యాగ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న స్టార్ కాబట్టే ఈజీ టార్గెట్ అనుకుంటోంది.. కాని రౌడీకి తామున్నామంటున్నారు ఫ్యాన్స్.. ఏదేమైనా ఈ వార్ ఆన్ వర్డ్స్ కి ఇప్పట్లో క్లైమాక్స్ కష్టమే అంటున్నారు.