Oscar: ఆస్కార్ వచ్చినా అవమానాలు తప్పవా.. ఎంత బలుపు..?

తెలుగు పాట నాటు నాటుకి ఆస్కార్ దక్కినా, మన సినిమాకు అవమానాలు తప్పట్లేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అనేది వెస్టర్న్ కంట్రీస్ అభిప్రాయం.. కాని ఇక్కడ బాలీవుడ్ లాంటి డజన్ పైనే ఫిల్మ్ ఇండస్ట్రీలున్నాయని తెల్లోల్లకు ఎప్పుడు అర్ధమౌతుంది.. అయినా బాలీవుడ్ వాళ్లకే తెలుగు సినిమాకు, తమిళ్ మూవీకి తేడా తెలియదు.. టాలీవుడ్ అంటే తమిళ్ మూవీ అనుకుంటారు.. ఆస్కార్ వేదిన నుంచి ప్రియాంకా చోప్రా వరకు అంతటా ఇప్పటికీ మన సినిమాకు అవమానాలు తప్పట్లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2023 | 06:04 PMLast Updated on: Mar 30, 2023 | 6:04 PM

Rrr Movie Natu Song Won Oscar

రీసెంట్ గా ప్రియాంకా చోప్రా త్రిబుల్ ఆర్ మూవీని తమిల్ మూవీ అనటంతో, నెటీజన్స్ ఫైర్ అవటం మొదలైంది. కాని ఈ అవమానాల పరంపర ఇప్పటిది కాదు.. ఆస్కార్ వేదిక మీద కూడా వ్యాఖ్యాత జిమ్మీ కెమాల్ కూడా త్రిబుల్ ఆర్ ని బాలీవుడ్ మూవీనేఅన్నాడు. అలా కష్టపడేది మనోళ్లే పేరు మాత్రం బాలీవుడ్ ఎకౌంట్లో పడుతోంది. సరే సని సరిపెట్టుకుంటే, బాలీవుడ్ వాళ్లు కూడా మనోళ్ల కష్టాన్ని కోలీవుడ్ కిచ్చేస్తున్నారు. తెలుగు సినిమాను తమిళ్ మూవీ అంటూ అగ్నానంతో వాగేస్తున్నారు

ఒకప్పుడు సౌత్ సినిమా అనేవాళ్లని, తెలుగు సినిమా ప్రత్యేకమని బాహుబలితో ప్రూవ్ చేశాడు రాజమౌళి. దీంతో తెలుగు,తమిల్, మలయాళ ఫిల్మ ఇండస్ట్రీలు వేరు వేరని నార్త్ జనానికి అర్ధమైంది. త్రిబుల్ ఆర్ తో లెక్క మారింది. ఇప్పుడు ఓరకంగా కన్నడ కేజీయఫ్, కాంతారా మూవీలు తెలుగు సినిమాలంటూ కన్నడ సినిమాల క్రెడిట్ మన ఎకౌంట్లో వేస్తున్నారు. ఇది బాలీవుడ్, హాలీవుడ్ లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల మీద అవగాహన లేక చేసే వ్యాఖ్యలు..