Oscar RRR : ఆస్కార్ వేదికపై మరోసారి RRR సినిమా..

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 96వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. అయితే ఈ ఏడాది భారతీయ సినిమాలు లేకపోయినా... ఆర్ఆర్ఆర్ ఫీవర్ తో మరోసారి మార్మోగిపోయింది డోల్బీ థియేటర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2024 | 12:37 PMLast Updated on: Mar 11, 2024 | 12:37 PM

Rrr Movie On Oscar Stage Once Again

 

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 96వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. అయితే ఈ ఏడాది భారతీయ సినిమాలు లేకపోయినా… ఆర్ఆర్ఆర్ ఫీవర్ తో మరోసారి మార్మోగిపోయింది డోల్బీ థియేటర్.

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ అనేక అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. పైగా తమ నటనతో చరణ్, తారక్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాంటి ఈ మూవీ భారతీయుల చిరకాల కలను తీర్చి… ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు అందుకొని మన సినీ ఖ్యాతిని అందుకొని సత్తాను చాటారు.అయితే తాజాగా జరిగిన అవార్డుల వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీని తలుచుకున్నారు

ఆస్కార్ వేదికపై యాంకర్లు స్టంట్ సీక్వెల్స్ గురించి వివరిస్తూ, సినిమాకు స్టంట్ మాస్టర్ అన్ సంగ్ హీరోగా పేర్కొంటూ.. కొన్ని యాక్షన్ సీన్స్ ను చూపించారు. చాప్లిన్, లాయిడ్ సినిమాల నుంచి యాక్షన్ పార్ట్ లను చూపిస్తూ, బ్లాక్ పాంతర వంటి సినిమాలలోనూ ఇతర యాక్షన్ సినిమాలలోని యాక్షన్ పార్ట్ చూపిస్తూ స్టంట్ సినిమాకు ఎంత కీలకమో తెలియజేశారు. స్టంట్ అనేది సినిమాకు మెమెరబుల్ మూమెంట్స్ అని తెలిపారు. అలా ఆస్కార్ వేదికపై స్టంట్స్ కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో వేయగా అందులో ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి రెండు యాక్షన్ షాట్స్ ని చూపించారు. అలాగే చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పు కూడా స్టేజ్ వెనక తెరపై చూపించారు.. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మరోసారి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఆస్కార్ స్టేజ్ పై చోటు దక్కడంతో ప్రైడ్ గా ఫీలవుతున్నట్లు ట్విట్ చేస్తున్నారు.