Oscar: ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వచ్చేసినట్లే..ఈ లెక్క చూస్తే మీకే అర్థం అవుతుంది..
ఆస్కార్ అవార్డును ముద్దాడాలన్నది సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఆర్టిస్ట్ కల. 94ఏళ్ల చరిత్ర ఆస్కార్‌ది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను వరించి మరిన్ని మంచి చిత్రాలు వచ్చేలా.. మేకర్స్‌ను ప్రోత్సహించింది.
95వ ఆస్కార్ వేడుక కాసేపట్లో లాస్ఏంజెల్స్‌లో జరగనుంది. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌కు వివిధ భాషల్లో దాదాపు 3వందల సినిమాలు నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయ్. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగీరిలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడం పట్ల యావత్ భారత చలన చిత్ర పరిశ్రమ గర్విస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ఆస్కార్ వరించాలని కోరుకుంటున్నారు.
కొందరు విశ్లేషకులయితే. ఆస్కార్‌కు అడుగు దూరంలో కాదు.. ఆర్‌ఆర్‌ఆర్ అరచేతిలోనే ఆస్కార్ ఉంది అని అంటున్నారు. అందుకు పలు కారణాలు, ఉదాహరణలు చెప్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్… ఇలా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇవన్నీ ఆస్కార్ అందుకోవడానికి ముందు జరిగే ప్రక్రియలు అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ఆస్కార్‌కు ఎంపికైనప్పుడు ఇదే ప్రాసెస్ జరిగిందని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ అంతా తరచూ అమెరికా పర్యాటనలో ఉండటం, ప్రమోషన్ యాక్టివిటీస్‌ని వేగవంతం చేయడం కూడా అందులో భాగమే అని చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటున్న విశ్లేషకులు ఆస్కార్ ట్రిపుల్ ఆర్ దే అంటున్నారు.