Oscar Awards: ఒక్క సినిమా.. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటింది

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఆస్కార్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 11:35 AMLast Updated on: Mar 12, 2023 | 12:30 PM

Rrr Nominatied For Oscar
  • ఒక్క సినిమా.. తెలుగోడి సత్తాను ప్రంపంచానికి చాటింది
  • ఒక్కసినిమా.. సినీ ఇండస్ట్రీకి ఉన్న ఎల్లలను చెరిపేసింది
  • ఒక్క సినిమా.. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మాత్రమే కాదని నిరూపించింది
  • ఒక్క సినిమా.. ప్రతీ ఎలిమెంట్‌ సినిమాకు ప్రాణసమానమే అని స్పష్టం చేసింది
  • ఒక్క సినిమా.. టాలీవుడ్‌ను సినీ ప్రపంచంలో శిఖరాగ్రాన నిలబెట్టింది

ఏళ్ల తరబడి పడ్డ కష్టం. సమయాన్ని మర్చిపోయి పెట్టిన శ్రమ. కుటుంబాన్ని పట్టించుకోకుండా చేసిన కృషి. ఇవన్నీ కలిపితేనే మన కళ్ల ముందు కనిపించింది ట్రిపులార్‌ సినిమా. పేరుకు ఇది కమర్షియల్‌ సినిమా కావచ్చు. కానీ ఎమోషనల్‌గా ఇదొక అద్భుతం. తెలుగు టాలెంట్‌ను ప్రపంచానికి చూపించేందుకు ఉపయోగపడ్డ సాధనం. సెకన్‌ విషయంలో కూడా కాంప్రమైజ్‌ కాకుండా పని చేసిన రాజమౌళి దార్శనీకతకు, దర్శకత్వ పటిమకు నిదర్శనం. పేరు పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్నా.. ఇదే తమ మొదటి సినిమా అన్నంత డెడికేషన్‌తో నటించిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఈ సినిమా హీరోలు కాదు.. ఈ సినిమాకు వాళ్లే ప్రాణం. ఏది గ్రాఫిక్స్‌, ఏది ఒరిజినల్‌ అని నిపుణులు కూడా కనిపెట్టలేని స్థాయిలో చిత్రీకరించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు రూపం.

కంటికి కనిపించే ప్రతీ సన్నివేశాన్ని మనసు వరకూ చేర్చిన సంగీతం ఈ సినిమాకు ఆత్మ. వీళ్లందరి సమ్మిళితప్రావీణ్యతే మనముందు ఆవిష్కృతమైన ‘రణం-రౌద్రం-రుధిరం’. చలనచిత్ర రంగం ఆత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డ్‌కు అడుగు దూరంలో ఉంది ట్రిపులార్‌ సినిమా. ఈ సినిమాకు ఆస్కార్‌ రావొచ్చు.. రాకపోవచ్చు.. కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రిపులార్‌ సంపాదించుకున్న క్రేజ్‌ 100 ఆస్కార్‌లకు సమానం. సినిమా రిలీజైంది మొదలు ఇప్పటి వరకూ.. ప్రపంచంలో ఉన్న సగటు సినీ అభిమాని నోట రోజుకు ఒక్కసారి అయినా ట్రిపులార్‌ అనే మాట వస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయంగా ట్రిపులార్‌ సంపాదించుకున్న క్రేజ్‌ అది. ఆస్కార్‌ వస్తే సంతోషమే.. కానీ ఆ అవార్డ్‌ ట్రిపులార్‌కు కొలమానం మాత్రం కాదు. ఎవరు ఏమన్నా.. ఎన్ని విమర్శలు ఎదురైనా.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ట్రిపులార్‌ సినిమా ఓ సువర్ణ అధ్యాయం.. చెరిగిపోని కళాఖండం. అంతర్జాతీయ గుర్తింపు కోసం వెళ్లిన జక్కన్న టీం.. ఆస్కార్‌తో తిరిగి రావాలని మనస్పూర్థిగా ఆశిద్ధాం.. ఆల్‌ ది బెస్ట్‌ ట్రిపులార్‌ టీం.