RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌కు దర్శకుడు ఆతనేనా..?

రీసెంట్‌గా రాజమౌళి ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి చెప్తూ ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రివీల్‌ చేశారు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. త్వరలో ట్రిపులార్‌ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతోందని చెప్పాడు. కానీ ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చని ట్విస్ట్‌ ఇచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 10:14 AMLast Updated on: Jul 12, 2023 | 10:15 AM

Rrr Sequel Likely To Be Helmed By Hollywood Director Or Karthikeya

RRR Sequel: ఎస్‌ఎస్‌ రాజమౌళి.. ఇది ఇప్పుడు పేరు మాత్రమే కాదు. సినీ ప్రపంచంలో ఇదో బ్రాండ్‌. బాహుబలి, ట్రిపులార్‌ సినిమాలతో జక్కన్న సొంతం చేసుకున్న క్రేజ్‌ ఇది. బాహుబలితో ఇండియన్ ఫిలిం రికార్డ్స్‌ను తిరగరాసిన రాజమౌళి.. ట్రిపులార్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రతీ న్యూస్‌ ఇంటర్నేషనల్‌గా, హాట్‌ టాపిక్‌గా మారిపోతోంది.

రీసెంట్‌గా రాజమౌళి ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి చెప్తూ ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రివీల్‌ చేశారు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. త్వరలో ట్రిపులార్‌ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతోందని చెప్పాడు. కానీ ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చని ట్విస్ట్‌ ఇచ్చాడు. దీంతో ట్రిపులార్‌ సీక్వెల్‌ తీసే డైరెక్టర్‌ ఎవరా అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాను తీసే చాన్స్‌ ఉంది అని కొందరు అంటే.. కొందరు మాత్రం తెలుగు దర్శకుల్లోనే ఎవరో ఒకరు ఈ సినిమా డైరెక్ట్‌ చేస్తారు అని చెప్తున్నారు. అయితే వీళ్లలో రాజమౌళి కొడుకు కార్తికేయ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకు డైరెక్షన్‌ చేయకపోయినా.. బాహుబలి సినిమాకు సెకండ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ.

లైన్‌ ప్రొడ్యూసర్‌గా ట్రిపులార్‌ సినిమాకు అన్నీ తానై నడిపించాడు. నిజం చెప్పాలంటే ట్రిపులార్‌ సినిమాను ఆస్కార్‌ స్థాయికి తీసుకువెళ్లడంతో కార్తికేయదే కీ రోల్‌. అప్లికేషన్‌ దగ్గర్నించి అవార్డ్‌ అందుకోవడం దాకా ప్రతీ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. సినిమా దర్శకత్వం మీద కూడా కార్తికేయకు అంతే గ్రిప్‌ ఉంది. దీంతో ట్రిపులార్‌ సీక్వెల్‌ను రాజమౌళి వారసుడిగా కార్తికేయ తెరకెక్కించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా రాజమౌళి పర్యవేక్షణలోనే జరగబోతోందని టాక్‌. ఇదే నిజమైతే త్వరలోనే రాజమౌళికి వారసుడు రాబోతున్నట్టే.