RRR’ ఆస్కార్ ఖర్చు 200 కోట్లు.. ‘కన్నప్ప’కు ఇప్పిస్తారా.. మంచు విష్ణు సంచలనం..!

కన్నప్ప విషయంలో ఎవరేమన్నా కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్.. దానికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాము.. ఎవరెంత ట్రోల్ చేసినా.. విమర్శించినా.. పట్టించుకోము అంటున్నాడు మంచు వారబ్బాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2025 | 04:32 PMLast Updated on: Mar 18, 2025 | 4:32 PM

Rrrs Oscar Cost Is 200 Crores Will It Be Given To Kannappa Manchu Vishnu Sensation

కన్నప్ప విషయంలో ఎవరేమన్నా కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్.. దానికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాము.. ఎవరెంత ట్రోల్ చేసినా.. విమర్శించినా.. పట్టించుకోము అంటున్నాడు మంచు వారబ్బాయి. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు కన్నప్ప సినిమా చేయడం ఏమో గానీ.. అది మొదలైన రోజు నుంచే ట్రోలర్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ఏది విడుదల చేసిన కూడా ట్రోల్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. తాజాగా ఇదే విషయంపై ఓపెన్ అయ్యాడు మంచు విష్ణు. ఏకంగా రాజమౌళినే టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. తమ కన్నప్ప సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాడు. తాను ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది.. నీకెందుకు అంత పెద్ద సినిమా.. నీకున్న మార్కెట్కు అవసరమా నీకు ఇది అంటూ తక్కువ చేసి మాట్లాడారు అని గుర్తు చేసుకున్నాడు మంచు విష్ణు.

బయటి నిర్మాతలు అయితే తన మీద అంత బడ్జెట్ పెట్టలేరు అని.. తనే సొంతంగా కన్నప్ప సినిమా తీసినట్టు చెప్పాడు. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి కావాలనే చాలామంది విమర్శిస్తున్నారని.. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. నిజం చెప్పాలంటే ఇందులో ఉన్న పాటలు, టీజర్లకు బయటి భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని.. అక్కడి నుంచి జీరో నెగెటివిటీ ఉంది అని చెప్తున్నాడు. హిందీ, తమిళ్, మలయాళ, కన్నడలో కన్నప్ప సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అన్నాడు. కానీ తెలుగులో మాత్రం 15 – 20 శాతం నెగిటివిటీ ఉందనీ.. తెలుగు ఆడియన్స్ తప్పులు వెతికి, పనికిమాలిన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పుకొచ్చాడు విష్ణు. సినిమాని సినిమాగా చూడాలి గానీ.. కావాలని తప్పులు వెతకడానికి సినిమాను చూస్తే అసలు ఎంజాయ్ చేయలేరు అన్నాడు ఈ హీరో. ఇదే కన్నప్ప సినిమాను రాజమౌళి తీస్తే ప్రశ్నిస్తారా.. అసలు లేదు కదా.. అదే మహా ప్రసాదం అన్నట్టు సినిమా చూస్తారు అంటున్నాడు విష్ణు.

తెలుగువాళ్లు గర్వపడాల్సిన మూమెంట్ RRR ఆస్కార్ గెలవడం అని.. గెలిచిన తర్వాత కూడా కొంతమంది విమర్శలు చేశారనీ గుర్తు చేశాడు ఈయన. ఆస్కార్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారని.. దాన్ని మనీ ఇచ్చి తెచ్చుకున్నారు అంత కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని మంచు విష్ణు సీరియస్ అయ్యాడు. కావాలంటే తాను 200 కోట్లు ఇస్తాను.. ఆ విమర్శలు చేసిన వాళ్లు తనకు ఆస్కార్ అవార్డు ఇప్పిస్తారా అంటూ ప్రశ్నించాడు. ఇండియన్ సినిమాకు ఆస్కార్ రావడం గ్రేట్.. అక్కడ స్టేజిపై తెలుగు పాట వేశారు.. వీటి కంటే గర్వించదగ్గ విషయం ఏంటి.. అవి పట్టించుకోకుండా ఈ నెగిటివిటీ ఏంటి అంటూ సీరియస్ అయ్యాడు. ఇప్పుడు తన కన్నప్ప సినిమా విషయంలో కూడా కావాలనే కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నాడు విష్ణు. మనోడు కన్నప్ప సినిమా ప్రమోట్ చేసుకోవడం ఏమో కానీ.. మధ్యలో రాజమౌళి పేరు తీసుకొచ్చి తన సినిమాను మరింత పాపులర్ చేసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి బడా స్టార్స్ ఉన్నారు. మరి వాళ్ళ అప్పియరెన్స్ తో సినిమాకు కలెక్షన్స్ వస్తాయా లేదా అనేది చూడాలి.