SALAAR: ఆర్ఆర్ఆర్‌ని దాట లేకపోయిన సలార్.. అదే కారణమా..?

2023లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా సలార్‌ నిలిచింది. రూ.178 కోట్లతో సలార్ ఫస్ట్ ప్లేస్‌లో వుంటే.. రూ.148 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసిన లియోది సెకండ్‌ ప్లేస్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2023 | 05:22 PMLast Updated on: Dec 24, 2023 | 5:22 PM

Rrrsalaarsalaar Didnt Crossed Rrr At Box Office On Day 1

SALAAR: సలార్‌ పాజిటివ్‌ టాక్‌తో, భారీ వసూళ్లతో దూసుకుపోతున్నా.. డార్లింగ్‌ ఫ్యాన్స్‌ మాత్రం హ్యాపీగా లేరు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ డే రికార్డ్‌ బద్దలు కొట్టలేదన్న ఫీలింగ్‌ లేకపోయినా ఓ బాధ మాత్రం వీళ్లను వెంటాడుతోంది. హ్యాట్రిక్‌ ఫ్లాప్‌తో వున్న ప్రభాస్‌కు సలార్‌ ఊపిరిపోయడమే కాదు. భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. వరల్డ్‌వైడ్‌ ఆర్‌ఆర్ఆర్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేయదని తెలిసినా.. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ను దాటుతుందని ప్యాన్స్‌ అంచనా వేశారు.

Global Star, Ram Charan : హైద‌రాబాద్‌ టీమ్‌ను కొన్న రామ్ చ‌ర‌ణ్..

మల్టీప్లెక్స్‌ టిక్కెట్‌ రూ.400 చేసినా.. సింగిల్‌ స్క్రీన్‌ టిక్కెట్‌ రేటు 275 వున్నా.. రోజుకు ఆరు ఆటలతోపాటు.. బెనిఫిట్‌ షోస్‌కు పర్మిషన్‌ ఇచ్చినా ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును సలార్‌ దాటలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ మొదటి రోజు వరల్డ్‌ వైడ్‌ రూ.257 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. బాహుబలి2 రూ.217 కోట్లు తీసుకొస్తే.. సలార్‌ రూ.178 కోట్లతో థర్డ్‌ ప్లేస్‌లో వుంది. ఆ తర్వాత నాలుగో ప్లేస్‌ రూ.165 కోట్లతో కెజిఎఫ్‌2 దక్కించుకుంది. సలార్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను దాటకపోయినా.. ఈ ఏడాది బాక్సాఫీస్‌ మొనగాడు మాత్రం ప్రభాసే. 2023లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా సలార్‌ నిలిచింది. రూ.178 కోట్లతో సలార్ ఫస్ట్ ప్లేస్‌లో వుంటే.. రూ.148 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసిన లియోది సెకండ్‌ ప్లేస్‌.

ఈ ఏడాది ఫస్ట్ డే టాప్‌ 5గ్రాసర్స్‌లో ప్రభాస్‌ సినిమాలు రెండున్నాయి. ఒకటి మూడు స్థానాల్లో సలార్‌, ఆదిపురుష్‌ వున్నాయి. ఆదిపురుష్‌ ఫ్లాప్‌ అయినా.. మొదటి రోజు రూ.140 కోట్లు వసూలు చేసింది. రూ.129 కోట్లతో జవాన్‌.. రూ.116 కోట్లతో యానిమల్‌ నాలుగైదు స్థానాల్లో వున్నాయి. సలార్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ బాగున్నాయి. వీకెండ్‌ ప్రి బుక్సింగ్స్‌తో అదరగొట్టేస్తుంది. అంతా బాగానే వున్నా.. ప్రమోషన్‌ లేకుండా సలార్‌ రిలీజ్‌ చేయడం ఏంటంటూ ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు. ప్రమోషన్‌ చేసి మరింత హైప్‌ తీసుకొస్తే.. ఫస్ట్ డే వసూళ్లు మరింత పెరిగేవేమో అని విమర్శిస్తున్నారు. ప్రభాస్‌ సినిమా ప్రమోషన్‌ లేకుండా రిలీజ్‌ కావడం ఇదే ఫస్ట్ టైం. సాహో.. రాధేశ్యామ్‌.. ఆదిపురుష్‌ ప్రమోషన్‌లో పాల్గొన్నాడు ప్రభాస్‌. మాంచి హైప్‌ వున్న ఆదిపురుష్‌ను టీజర్‌ దెబ్బకొట్టింది. అన్నిరకాలుగా విమర్శలు, ట్రోలింగ్‌కు గురికావడంతో అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

 Guntur Karam Item Song  : మహేష్ కోసం మాస్ మసాలా సాంగ్ 

ట్రైలర్‌తో కాస్త ఓకె అనిపించినా.. భారీ ప్రమోషన్‌తో ఆదిపురుష్‌కు మళ్లీ హైప్‌ తీసుకొచ్చారు. సినిమా ఫ్లాప్‌ అయినా.. మొదటి రోజు రూ.140 కోట్లు తీసుకొచ్చింది. సలార్‌ విషయంలో ప్రభాస్‌ ప్రమోషన్‌కు దూరంగా ఉన్నాడు. రాజమౌళితో ఇంటర్వ్యూ తప్పితే సందడి లేదు. ఈ ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్‌లో వుండడంతో.. రీజనల్‌ లాంగ్వేజ్‌కు చేరలేదు. రాజమౌళి తన ప్రాజెక్ట్‌ను బాగా మార్కెట్‌ చేసుకుంటాడు కాబట్టే.. ఇప్పటికీ బాహుబలి.. ఆర్‌ఆర్‌ఆర్‌తో రికార్డులు క్రియేట్‌ చేశాడు.
పివిఆర్‌.. ఐనాక్స్‌తో మేకర్స్‌ ఇష్యూ ఫేస్ చేయడం కూడా ఫస్ట్‌ డే ఓపెనింగ్స్‌కు గండి కొట్టింది.

రిలీజ్‌కు ముందు రోజు సాయంత్రం కొన్ని చోట్ల.. రిలీజ్ రోజు మరికొన్ని చోట్ల పివిఆర్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయినా.. చాలామందికి తెలీదు. టిక్కెట్స్‌ అయిపోయాయి. తర్వాత చూద్దాములే అనుకున్నారు కొందరు. ఇప్పుడు ఎలాగూ రిజల్డ్‌ బాగుంది కాబట్టి.. ఇప్పటికైనా డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో కలెక్షన్స్‌ నిలబడేలా చేస్తారా..? లేదంటే.. రాజమౌళి ఇంటర్వ్యూతో సరిపెడతారో చూడాలి మరి.