Ram Charan: తెలుగు మెగా పవర్ స్టార్ కోసం హిందీ హీరో వెతుకులాట.. క్యా సీన్ హై..
రామ్ చరణ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కంప్లైంట్ ఇచ్చింది. విచిత్రంగా చెర్రీ కోసం రణ్ వీర్ సింగ్ వెతుకుతున్నాడు. సీన్ లో త్రిషా కూడా ఉంది.. ఇందంతా ఓ యాడ్ కోసమే అంటున్నారు. విచిత్రం ఏంటంటే, ఇది యాడ్ మాత్రమే కాదు సినిమాటిక్ యాడ్ అంటా.? అంటే ఏంటి? చూసేయండి.

Rumor has it that Trisha, Ranveer Singh and Deepika Padukone are looking for Ram Charan for the ad they are doing together
దీపికా, రామ్ చరణ్, రన్ వీర్ సింగ్, త్రిషా కాంబినేషన్ లో ఓ సీక్రెట్ యాడ్ వచ్చింది. ఆ వీడియో వైరలైంది. తన భర్తని వెతకమని దీపికా, ఏజెంట్ గా రామ్ చరణ్, ఎవరినో వెంటాడుతూ ఫైర్ అయ్యే రణ్ వీర్ సింగ్, డైలామాలో ఉండే త్రిషా ఈ విజువల్స్ తో చాలా ఇంట్రస్టింగ్ ఉన్న ఆ సీక్రెట్ యాడ్, రెగ్యులర్ యాడ్ కాదట.
అక్కడే ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు మనం సినిమాటిక్ యూనివర్స్ చూసాం. అంటే ఒక మూవీలో హిరో పాత్రకి మరోసినిమాతో సంబంధం ఉండటం, అలా ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి కొన్ని మూవీల్లో మెరవటం కామన్. ఇదే ఫార్ములాని యాడ్ కి అప్టై చేస్తున్నారు.
రామ్ చరణ్ చేసే యాడ్స్ కి, దీపికా, రణ్ వీర్ సింగ్ చేసే యాడ్స్ కి లింక్ పెట్టి, అదో సినిమాటిక్ యూనివర్స్ లా, యాడ్ యూనివర్స్ ప్లాన్ చేశారట. ఇకమీదట చెర్రీ, దీపికా, రణ్ వీర్ సింగ్, త్రిషా వీళ్లు ఏ యాడ్ చేసినా అన్నీంటికీ ఇంటర్ లింక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. సో ఒకరితో మరొకరిని ఇక మీదట కంటిన్యూయస్ గా యాడ్స్ లో చూడటం కూడా కామన్ అవనుంది. ఈ విషయంలో ఓ యాడ్ ఏజెన్సీతో ఇలాంటి వినూత్నమైన యాడ్ ఫార్ములాను ఈ నలుగురు మొదలు పెట్టారు. మరి ఈ ట్రెండ్ ని ఇంకెంత మంది స్టార్స్ ఫాలో అవుతారో చూడాలి..