చైతన్యను వదిలిపెట్టని S
టాలీవుడ్‌కు సంబంధించి న్యూస్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే స్టార్స్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత. వీళ్ల పెళ్లి జరిగిన టైంలో ఫ్యాన్స్ ఎంత అటెన్షన్ పే చేశారో.. విడాకుల సమయంలో అంతకంటే డబుల్ అటెన్షన్ పే చేశారు. వీళ్లిద్దరూ విడిపోతున్న టైంలో ఇండైరెక్ట్‌గా చేసిన కామెంట్స్ పెట్టిన పోస్ట్‌లు అన్నీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. మొత్తానికి వాళ్ల చుట్టూ అల్లుకున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్లు బతుకుతున్నారు. దాదాపుగా అదే టైంలో చైతూ క్లోజ్ ఫ్రెండ్ శోభిత దూళిపాళ చైతూ జీవితంలోకి మరింత క్లోజ్‌గా ఎంటర్ అయ్యింది. వైఫ్‌తో విడిపోయి ఉన్న చైతన్యకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది. నిజానికి శోభిత వల్లే సామ్, చైతన్య విడిపోయారనే అరోపణలు ఉన్నా.. సామ్‌తో విడిపోయాకే శోభిత దగ్గరయ్యింది అనేది చైతన్య సపోర్టర్స్ వాదన. ఈ వాదనలు ఎలా ఉన్నా.. సామ్ వెళ్లగానే శోభిత ఎంటర్ అయ్యింది. చాలా కాలం వీళ్లు చేసుకున్న పార్టీలు తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. ఆ మధ్య మిడ్ నైట్ చైతన్య ఇంటి ముందు శోభిత కారు కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. కానీ ఇద్దరూ ఎప్పుడు ఈ విషయంపై పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అటు సామ్ వెళ్లిన కొన్నేళ్లకే శోభిత చైతూ జీవితంలోకి వచ్చింది. సమంత శోభిత ఇద్దరి పేరు స్టార్ట్ అయ్యేది S లెటర్‌తోనే. ఎలా చూసినా S లెటర్ చైతన్యను వదిలిపెట్టడంలేదని పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక వీళ్లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న డేట్ కూడా చాలా స్పెషల్ అవ్వడంతో.. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా.. సీక్రెట్ లవ్‌తో రిలేషన్‌షిప్ మెయిన్‌టేన్ చేసిన ఈ లవర్స్ ఇప్పుడు ఓపెన్ ఎంగేజ్‌మెంట్‌తో వైఫ్ అండ్ హస్బెండ్‌గా మారబోతున్నారు. బ్యాడ్ మోమోరీస్ అన్నిటికీ గుడ్ బై చెప్పేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు.