Ramcharan: ఆర్సీ 16పై మరింత హైప్.. చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా సచిన్‌ కూతురు..

చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ మూవీలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ కూతురు సారా టెండుల్కర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే మొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించడగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2023 | 04:28 PMLast Updated on: Nov 21, 2023 | 4:28 PM

Sachin Tendulkars Daughter Sara To Act With Ramcharan In Rc16

Ramcharan: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీ తర్వాత ఆర్సీ 16 సెట్‌లో అడుగుపెట్టనున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్‌ బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Trisha Krishnan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు..

బుచ్చిబాబు నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ మూవీలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ కూతురు సారా టెండుల్కర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే మొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించడగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. కథకు కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని బుచ్చిబాబు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సారా టెండుల్కర్‌ ఆ పాత్రకు సరిగ్గా సూట్‌ అవుతుందని అనుకున్నారట. త్వరలో సారాను అప్రోచ్ అవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. రంగ‌స్థలం త‌ర‌హాలో RC 16 కోసం రామ్ చ‌ర‌ణ్ ఓ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నార‌ట‌. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో సారాను హీరోయిన్‌గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది. ప్రచారంలో ఉన్న ఈ వార్త గనుక నిజం అయితే.. సారా.. రామ్‌ చరణ్‌తో కలిసి నటించడానికి ఒప్పుకుంటే.. చెర్రీ ఫ్యాన్స్‌తో పాటు సచిన్‌ ఫ్యాన్స్‌‌కు కూడా పండగే అని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతోందో.