Sai Daram Tej: వివాదంలో సాయి ధరమ్ తేజ్.. హారతిపై అర్చకుల మండిపాటు!!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. అర్చకుల బదులు తానే దేవుడికి హారతిచ్చి విమర్శలు ఎదుర్కుంటున్నాడు.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. అర్చకుల బదులు తానే దేవుడికి హారతిచ్చి విమర్శలు ఎదుర్కుంటున్నాడు. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా వస్తున్న బ్రో సినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. సాయిధరమ్ తేజ్ శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి పూజలు చేశాడు. అయితే ఆలయంతో అర్చకుల బదులు తానే దేవుడికి హారతి ఇచ్చాడు. ఇదే తేజ్‌ను చిక్కుల్లో పడేసింది. శ్రీకాళహస్తి ఆలయ నిబంధనల ప్రకారం అర్చకులు కాకుండా వేరే వ్యక్తులు హారతి ఇవ్వకూడదు. పూజలో మాత్రమే కూర్చోవాలి. అయితే తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ దేవుడికి హారతిచ్చాడు తేజ్. దీనిపై ఆలయ అర్చకులు మండిపడుతున్నారు. నిబంధనలు తెలియకుండా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఫైర్ అవుతున్నారు.
అయితే ఈ వ్యవహారంపై తేజ్ ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే తమిళ్‌లో మంచి హిట్ ఐన వినోదయాసితం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాన్ ఇద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఈ సినిమాకు కూడా సముద్రఖని దర్శకత్వం వహించాడు. స్క్రీన్-ప్లే, డైలాగ్స్ బాధ్యత త్రివిక్రం తీసుకున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు.