Sai Dharam Tej: పేరు మార్చుకున్న మెగా హీరో.. కొత్త పేరు ఏంటంటే..

పిల్లా నువ్వులేని జీవితంతో ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. గతంలో తన పేరుని సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. తాజాగా మరోసారి తన పేరుని మార్చుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2024 | 03:43 PMLast Updated on: Mar 09, 2024 | 3:43 PM

Sai Dharam Tej Changes His Name Include Moms Name In It

Sai Dharam Tej: తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్‌కి, నమ్మకాలకి మంచి గిరాకీ ఉంటుంది. జన్మతః ఉన్న పేరుని ఇండస్ట్రీలోకి రాగానే మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీరోలుగా అడుగు పెట్టిన వాళ్ళలో కొందరు.. మార్చుకున్న పేరుతోనే టాప్ రేంజ్‌కి వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తాజాగా మెగా మేనల్లుడు కూడా ఆ లిస్ట్‌లో చేరాడు. పిల్లా నువ్వులేని జీవితంతో ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

Pushpa2: పుష్ప‌-2లో మ‌రో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగ‌య్యా సామీ..!

గతంలో తన పేరుని సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. తాజాగా మరోసారి తన పేరుని మార్చుకున్నాడు. ఇక నుంచి తన పేరు సాయి దుర్గ తేజ్‌గా ఉండబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. అతని తల్లి పేరు దుర్గ. దీంతో ఆమె పేరునే యాడ్ చేసాడు. సాయి ప్రధాన పాత్రలో సోల్ ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలిం తెరకెక్కుతుంది. దుర్గ ప్రొడక్షన్‌పై ఆయన ఆ ఫిలింని నిర్మిస్తున్నాడు. మహిళా దినోత్సవం రోజున సాయి పేరుని మార్చుకోవడం విశేషం. కెరీర్ స్టార్టింగ్‌లో ఫుల్ స్పీడ్‌తో వెళ్లిన సాయి పేరు మార్పుతో మళ్ళీ ఆ స్పీడ్ అందుకుంటాడేమో చూడాలి.

అతని నుంచి వచ్చిన చివరి రెండు మూవీల్లో విరూపాక్ష మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తన చిన్న మావయ్య పవన్ కళ్యాణ్‌తో చేసిన బ్రో మూవీ ఓ మోస్తరుగా ఆడింది. కాగా.. తన పెద్ద మావయ్య చిరంజీవితో కలిసి నటించాలనే కోరికని వెల్లడించాడు సాయి దుర్గ తేజ్.