Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత మెగా గొడవల్లో సాయితేజ్

రీసెంట్‌గా తన మేనేజర్‌తో కాస్ట్ ఫీలింగ్‌తో సాయితేజ్ గొడవ పెట్టుకున్నాడనే వార్త అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. బేసిగ్గా మెగా హీరోల్లో సాయితేజ్‌ని స్వాతిముత్యం అంటారు. అందరితో కలిసి పోతాడు. అవసరం అయితే బాలయ్య, తారక్‌తో కూడా కలిసి పోతాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2023 | 06:20 PMLast Updated on: Jun 03, 2023 | 6:20 PM

Sai Dharam Tej Creates Controversy In Manager Issue

Sai Dharam Tej: సుప్రీమ్ హీరో సాయితేజ్‌కి ఏమైంది? యాక్సిడెంట్ తర్వాత తన స్టోరీ సెలక్షన్‌కి, యాక్టింగ్‌కి.. అలానే పబ్లిక్ రిలేషన్స్‌కి ఇలా చాలా విషయాల్లో అతడిలో మార్పులు పెరిగాయంటున్నారు. రీసెంట్‌గా తన మేనేజర్‌తో కాస్ట్ ఫీలింగ్‌తో సాయితేజ్ గొడవ పెట్టుకున్నాడనే వార్త అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

బేసిగ్గా మెగా హీరోల్లో సాయితేజ్‌ని స్వాతిముత్యం అంటారు. అందరితో కలిసి పోతాడు. అవసరం అయితే బాలయ్య, తారక్‌తో కూడా కలిసి పోతాడు. మెగా హీరోలకి, నందమూరి హీరోలకి మధ్య ఎలాంటి ప్రొఫేషనల్ రైవల్రీ ఉన్నా.. సాయితేజ్ ఎవరినైనా కలుపుకొనిపోతాడు. బేసిగ్గా మంచోడనే ముద్రపడింది. అలాంటి హీరో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తన ఫ్రెండ్‌ని మేనేజర్‌గా తీసుకుని, తనతో ట్రావెల్ అవుతూ.. ఇప్పుడు సడన్‌గా కేవలం కాస్ట్ విషయంలో గొడవొచ్చిందని తిట్టాడా..? మళ్ళీ కనిపించొద్దన్నాడా..? నిజం చెప్పాలంటే సాయితేజ్ విరూపాక్షని ఆ రేంజ్ లో ప్రమోట్ చేసింది, సాయితేజ్ స్టోరీ సెలక్షన్‌ని మార్చింది తన మేనేజర్ కమ్ ఫ్రెండే అంటారు ఇండస్ట్రీలో.

అలాంటి తనని సాయితేజ్ ఎందుకు తిట్టాడో, నిజంగా గొడవపడ్డాడో లేదో కాని, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. సాయితేజ్ తన ఫ్రెండ్ అయిన మేనేజర్‌తో గొడవపడటం హాట్ టాపిక్ కాదు. కేవలం కాస్ట్ ఫీలింగ్‌తో, పరాయి కాస్ట్ వాడు తమ మెగా క్యాంప్‌లో పెత్తనం పెంచుకోవటం ఇష్టం లేకే సాయితేజ్ ఇలా తన ఫ్రెండ్‌నే దూరం పెడుతున్నాడనే గుసగుసలు పెరగడం ఇక్కడ హాట్ టాపిక్. బేసిగ్గా సాయి తేజ్ అలాంటి వ్యక్తి కాదనే అభిప్రాయం ఉంది. కాని ఎందుకు ఇలాంటి గుసగుసలొస్తున్నాయి. సమ్ థింగ్ ఫిషీ.