Sai pallavi: ల‌వ్ స్టోరీ.. సాయి ప‌ల్ల‌వి-చై వాలంటైన్స్‌డే సెల‌బ్రేష‌న్స్

జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్న చైతూతో కలిసి తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఒక క్యూట్ రీల్‌ని షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 01:21 PMLast Updated on: Feb 15, 2024 | 1:21 PM

Sai Pallavi And Naga Chaitanya Recreate Thandel Teaser In Valentines Day Video

Sai pallavi: అక్కినేని వారి హ్యాండ్సమ్ హీరో నాగ చైతన్య‌, నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్లవి హీరో హీరోయిన్లుగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “తండేల్”. శరవేగంగా పూర్తవుతున్న ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్‌కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌.. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కి చైతూ-సాయి ప‌ల్ల‌వి నుంచి ఓ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ వ‌చ్చింది. ఇద్దరూ క‌లిసి వాలంటైన్స్ డే విషెస్ చెప్పారు.

Chiranjeevi VS Pawan Kalyan : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా స్టార్‌, ప‌వ‌ర్ స్టార్ ఫైట్ త‌ప్ప‌దా..?

జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్న చైతూతో కలిసి తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఒక క్యూట్ రీల్‌ని షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో ట్రీట్‌తో మేకర్స్ ఈ చిత్రంలో చై, సాయి పల్లవి మ‌ధ్య బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ కూడా ఉన్నట్టుగా చూపించారు. ఇటీవల రిలీజైన ‘తండేల్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌లో ఉన్న డైలాగ్‌తో ఈ రీల్ చేశారు. గ్లింప్స్‌లోని డైలాగ్‌నే బయట రీక్రియేట్ చేసి ఈ వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా అందిస్తున్నట్టుగా తెలిపారు. ఈ డైలాగ్‌పై చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు. గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందంటూ చై ఓ వీడియో షేర్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్‌లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ తండేల్. పాన్ ఇండియా బ్రాండ్‌తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బోటుని నడిపే ఫిషర్ మెన్‌గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది. గెడ్డంతో రఫ్ లుక్‌లో చైతన్య క్యారెక్టర్‌ని కూడా పోస్టర్‌లో చూపించేశారు. తండేల్‌గా నాగ చైతన్య గెటప్‌తో రిలీజ్ చేసిన ఫోటో ఆడియెన్స్‌ను విశేషం గా ఆకట్టుకుంటోంది. నాగ చైతన్య మాస్ గెటప్‌లో రాక్ చేశాడు. యాక్షన్ అండ్ లవ్ స్టొరీగా పీరియాడిక్ జోనర్‌లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ తండేల్ మూవీ చైతూకి సూపర్ సక్సెస్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందా లేదా అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)