Sai Pallavi: అలా చేసినా వేధించినట్టే.. సాయి పల్లవి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

ప్రతీ విషయంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా స్త్రీని చిన్నచూపు చూడటం సరికాదని అభిప్రాయం తెలిపింది. ఈ పద్ధతి ఇండస్ట్రీలో మారాలని చెప్పింది. సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 01:54 PMLast Updated on: Mar 09, 2023 | 1:54 PM

Sai Pallavi Interesting Comments On Casting Couch And Sexual Abuse

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చాలా రోజులుగా చాలా మంది హీరోయిన్లు గళమెత్తుతున్నారు. మీటూ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి కూడా మీ టూ ఉద్యమం గురించి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది.

“నిజం” అనే పేరుతో పాప్‌ సింగర్‌ స్మిత ఓ సెలబ్రెటీ టాక్‌ షో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సాయిపల్లవి ఆ టాక్‌ షోకు గెస్ట్‌గా వెళ్లింది. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై టాపిక్‌ రావడంతో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి చెప్పింది సాయి పల్లవి. లైంగికంగానే కాకుండా మానసికంగా కూడా హీరోయిన్లు చాలా వేధింపులకు గురవుతున్నారంటూ చెప్పింది. కేవలం శారీరక వేధింపులే కాదు.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసే వ్యాఖ్యలు కూడా వేధింపుల కిందకే వస్తాయంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్లను అలా తక్కువ చేసి మాట్లాడే వాళ్లను చాలా మందిని తాను చూసినట్టు చెప్పింది.

ప్రతీ విషయంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా స్త్రీని చిన్నచూపు చూడటం సరికాదని అభిప్రాయం తెలిపింది. ఈ పద్ధతి ఇండస్ట్రీలో మారాలని చెప్పింది. సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. సాయి పల్లవికి కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.