SAI PALLAVI: మళ్లీ సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అనేస్తున్నారా..?
టాలీవుడ్‌లో మూడు నాలుగు మూవీలు చేయలేకుండానే, తనని ఇక్కడ పవర్ స్టార్‌కి ఫీమేల్ వర్షన్ అనేంతగా ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా తండేల్ మూవీ లాంచింగ్‌లో కూడా హీరోని కాదని ప్రెస్ మీట్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే మొదటి షాట్ వరకు సాయిపల్లవినే హైలెట్ చేశారు.

SAI PALLAVI: సాయిపల్లవి ఏం చేసినా సెన్సేషనే. ఎమ్‌సీఏ, శ్యామ్ సింగరాయ్, ఫిదా.. ఇలా చాలా తక్కువ తెలుగు సినిమాలు చేసినా తనకి టాలీవుడ్‌లో లేడీ పవర్ స్టార్ అనేంతగా పేరొచ్చింది. ఇప్పుడు తను మరోసారి నాగచైతన్యతో జోడీ కడుడూ తండేల్ మూవీ చేస్తోంది. నిజానికి సాయిపల్లవి తమిళ్, మలయాళంలో కూడా హిట్లు సొంతం చేసుకుంది. కాని అక్కడ తనకి లేడీ పవర్ స్టార్‌గానో, లేడీ సూపర్ స్టార్‌గానో పేరు రాలేదు. టాలీవుడ్‌లో మూడు నాలుగు మూవీలు చేయలేకుండానే, తనని ఇక్కడ పవర్ స్టార్‌కి ఫీమేల్ వర్షన్ అనేంతగా ఆకాశానికెత్తుతున్నారు.
Bollywood, Heroine Janhvi Kapoor : జాహ్నవి పూజలు ఎవరికోసం?
తాజాగా తండేల్ మూవీ లాంచింగ్‌లో కూడా హీరోని కాదని ప్రెస్ మీట్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే మొదటి షాట్ వరకు సాయిపల్లవినే హైలెట్ చేశారు. నిజంగానే సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్, తనకున్న ప్రత్యేక గుర్తింపు వల్లే అంతా తనని అంతగా గౌరవిస్తారు. తను ఎప్పుడు నచ్చిందే చేస్తుంది. నచ్చితేనే చేస్తుంది. వివాదాల జోలికెళ్లదు. స్కిన్ షో చేయదు. అయినా అందరికి నచ్చేస్తుంది. అంతా తన పెర్ఫామెన్స్‌తో పాటు, తన క్యారెక్టర్ వల్లే ఇలాంటి గుర్తింపు సాధ్యమైంది. అచ్చంగా పవన్ ఎంత నిజాయితీగా, సింపుల్‌గా ఉంటాడో, సాయిపల్లవి అలానే ఉంటుందని, ఫిదాలో తను పవన్ అభిమానిగా కనిపించిందని, ఇలా రకరకాల కారణాలతో తనని లేడీ పవర్ స్టార్ అనటం మొదలుపెట్టారు.
అందుకే తను చిన్న సినిమా చేసినా, పెద్ద మూవీ చేస్తున్నా, ఏ హీరోతో జోడీకడుతున్నా తన వైపే అందరి ఫోకస్ ఉంటుంది. అంత క్రౌడ్ పుల్లర్ కాబట్టే పవన్‌లో ఉన్న సుగుణాలతో పోలుస్తూ లేడీ పవర్ స్టార్ అనేస్తున్నారు. తండేల్ లాంచింగ్ లో హీరో చై సెట్ల ఉన్నా అంతా తన గురించే మాట్లాడటం అందుకు ఓ ఉదాహరణ.