SAI PALLAVI: చేతికందిన బంపర్ ఆఫర్స్ వదులుకుంటున్న సాయిపల్లవి

అల్లు అరవింద్ అండ్ కో నిర్మిస్తున్న హిందీ రామాయణం 1500 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కేజీయఫ్ ఫేం యశ్ రావణుడిగా నటించే ఈ సినిమాలో సీత పాత్ర సాయిపల్లవిదే. కాని సడన్‌గా తను తప్పుకుందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 07:28 PMLast Updated on: Feb 09, 2024 | 7:28 PM

Sai Pallavi Opts Out From Hindi Ramayan With Ranbir Kapoor

SAI PALLAVI: సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు ఫ్యాన్స్. యూత్‌లో పవన్‌కి ఉన్నంత క్రేజ్ హీరోయిన్లలో ఎవరికైనా ఉందంటే అది సాయిపల్లవికే. దానికి కారణం తను స్కిన్ షోని కాకుండా పెర్ఫామెన్స్‌ని నమ్ముకుంటుంది. పాత్రలో పాతుకుపోతుంది. పెర్ఫామెన్స్‌తో పేకాడేస్తుంది. ఏం చేసినా నచ్చిందే చేస్తుంది, నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తుంది. అంతా ఓకే, కాని ఎందుకు హిందీ రామాయణానికి రాంరాం చెప్పింది.

PAWAN KALYAN: పార్లమెంట్‌ సీటుపై కన్నేసిన పవన్‌.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?

అల్లు అరవింద్ అండ్ కో నిర్మిస్తున్న హిందీ రామాయణం 1500 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కేజీయఫ్ ఫేం యశ్ రావణుడిగా నటించే ఈ సినిమాలో సీత పాత్ర సాయిపల్లవిదే. కాని సడన్‌గా తను తప్పుకుందట. సీత పాత్ర చేసేందుకు అంతా క్యూ కడుతుంటే తనెందుకు వద్దంది.. రామాయణంలో సీత పాత్రకున్న ప్రయారిటీ తెలిసి కూడా నో చెప్పటానికి రీజనేంటి? అక్కడే ట్విస్ట్ ఉంది. ఎప్పుడో ఏడాదిక్రితం డేట్లడిగి ఇంతవరకు ఈ సినిమాను తెరకెక్కించలేదు దంగల్ ఫేం నితీష్ తీవారి. తను డిలే చేయటం వల్లే రాముడి పాత్ర వేయాల్సిన హృతిక్ పక్కకు తప్పుకున్నాడు. తన ప్లేస్‌లో రణ్‌బీర్ వచ్చి చేరాడు. ఇప్పుడు సాయి పల్లవి వంతొచ్చినట్టుంది. తను తప్పుకుంది.

ఆదిపురుష్ టైంలో కథ నచ్చక ప్రభాస్‌తో జోడీ కట్టే ఛాన్స్ మిస్ చేసుకుంది సాయిపల్లవి. సరే.. ఆదిపురుష్ రిజల్ట్ రివర్స్ అయ్యింది కాబట్టి అంతా పర్లేదనుకోవచ్చు. అదే హిట్టై ఉంటే సాయిపల్లవి మంచి ఆఫర్‌ని మిస్ చేసుకున్నట్టే. ఇప్పుడు హిందీ రామాయణం ఆఫర్‌ని కాదని సాయిపల్లవి మరో తప్పు చేస్తోందనంటున్నారు.