Sai Pallavi: అలియా భట్‌కు షాక్.. హిందీ రామాయణంలో సీతగా సాయిపల్లవి..!
మొన్నటి వరకు సాయిపల్లవి బాలీవుడ్ మూవీని పెద్ద జోక్ అన్నారు. కానీ, ఆ జోకే నిజమౌతోంది. ఆలియా భట్‌నే పక్కన పెట్టి సాయిపల్లవిని తీసుకునేంత వరకు సీన్ మారింది. బాలీవుడ్ రామాయణంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, రావణుడిగా కేజీయఫ్ స్టార్ యశ్‌ని తీసుకున్నారు.

Sai Pallavi: ఆలియా భట్‌కి తమిళ పొన్ను సాయి పల్లవి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది. రామాయణం నుంచి ఆలియా భట్ బయటికి వెళ్లటానికి కారణం కూడా సాయిపల్లవే అని తెలుస్తోంది. అల్లు అరవింద్, అలానే బాలీవుడ్ నిర్మాత కలిసి ప్లాన్ చేసిన రామాయణం మూవీలో సీతగా కనిపించబోతోంది సాయి పల్లవి. మొన్నటి వరకు సాయిపల్లవి బాలీవుడ్ మూవీని పెద్ద జోక్ అన్నారు. కానీ, ఆ జోకే నిజమౌతోంది. ఆలియా భట్‌నే పక్కన పెట్టి సాయిపల్లవిని తీసుకునేంత వరకు సీన్ మారింది.
బాలీవుడ్ రామాయణంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, రావణుడిగా కేజీయఫ్ స్టార్ యశ్‌ని తీసుకున్నారు. అంతా ఓకే.. కానీ, సీత ఎవరంటే ఆలియాను తీసుకోవాలనకున్నారు. కానీ, సీత పాత్ర గొప్పగా ఉండాలంటే.. బయట కూడా ఆ స్థాయి ఇమేజ్ ఉన్న వ్యక్తే కరెక్ట్ అని ఆలియాను పక్కనపెట్టారట. ఆదిపురుష్‌లో కృతిసనన్ సీత అంటే ఎవరికీ నచ్చలేదు. అసలు సీతాదేవి పాత్రకు తనేమాత్రం సరిపోలేదు. ఆస్ధాయి గాంభీర్యం, ఉన్నతమైన అప్పియరెన్స్ తనలో మిస్ అయ్యింది. పాత్రలో పాతుకుపోతే అది మంచి నటనౌతుంది. కాని, పాత్రలో దూరినంత మాత్రాన డివోషనల్ ఫీల్ రావటం కష్టం.
దానికి పర్సనల్ లైఫ్‌లో కూడా ఉన్నతంగా కనిపించటం చాలా ముఖ్యం. ఆ విషయంలో సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనేంత గొప్పగా పేరుంది. ఇక గ్లామర్ షో చేయదు.. నచ్చిందే చేస్తుంది… నచ్చితేనే చేస్తుందనే పేరు.. అందరి ఇంట్లో అమ్మాయి అనే ఐడెంటిటీ.. ఇవన్నీ బేస్ చేసుకుని సీత పాత్రకు సాయిపల్లవినే కన్ఫామ్ చేశారట. ఇప్పుడు నిర్ణయం సాయిపల్లవి చేతుల్లోనే ఉంది…