Sai Pallavi: సాయి పల్లవి షాకింగ్ డెసిషన్.. ఇందుకే కదా లేడీ పవర్‌స్టార్ అనేది..
తెలుగులో సాయి పల్లవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న సాయి పల్లవి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిషన్ ఆమె అభిమానులను షాక్‌కు గురి చేయడమే కాకుండా ఆమె కెరియర్‌కే నష్టం చేస్తుందంటున్నారు ఫ్యాన్స్.
పుట్టింది తమిళనాడులో అయినా.. చూడగానే తెలుగు అమ్మాయి అనిపించే అభినయం సాయి పల్లవిది. తెలుగులో తొలి సినిమాతోనే తన అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. తన యాక్టింగ్‌తో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది. పేరుకు తగ్గట్టుగా ఓ పవర్‌ఫుల్ డెసిషన్ తీసుకుంది సాయి పల్లవి. తన తరువాతి ప్రాజెక్ట్ కోసం ఏకంగా రెండు సంవత్సరాలు డేట్స్ ఇచ్చేసిందట. సాధారణంగా హీరోలు రెండు సంవత్సరాలు డేట్స్ ఇచ్చారంటే పెద్ద విషయం కాదు. కానీ హీరోయిన్స్ మాత్రం ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా అంత రిస్క్ చేయరు. సినిమాల పరంగా హీరోలకంటే హీరోయిన్‌ల సర్వీస్ చాలా తక్కువ. లుక్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్లతో సినిమాలు చేసేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా 30 ఇయర్స్ పైబడితే మంచి ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు రావడం చాలా తక్కువ. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సాయిపల్లవి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు. రామాయణాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాగా చిత్రీకరించేందుకు గీతా ఆర్ట్స్ వర్క్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవిని సీతగా ఫైనల్ చేశారట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఓ రేంజ్‌లో టాక్ నడుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటం, సినిమాలో సీత రోల్ ఎండ్ వరకూ ఉండటం కారణంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు చాలా టైం పడుతుంది. దీనికోసం ఏమీ ఆలోచించకుండా సాయి పల్లవి రెండు సంవత్సరాలు డేట్స్ ఇచ్చేసిందంటున్నారు. ఇదే నిజమైతే ఏ హీరోయిన్ చేసిన రిస్క్ సాయి పల్లవి చేసినట్టే.