Sai Pallavi: మూడు సినిమాలతో సాయి పల్లవి బిజీ.. అన్నీ మనసుకు నచ్చినవే..!

మొత్తానికి రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది సాయిపల్లవి. ప్రస్తుతం నటిస్తున్న ఆ మూడు సినిమాలు ఆసక్తికరమైనవే. విరాటపర్వం తర్వాత తెలుగుసినిమా ఓకే చేయడానికి సాయిపల్లవి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 07:15 PMLast Updated on: Oct 08, 2023 | 7:15 PM

Sai Pallavi Signed For Three Films In Telugu Hindi And Tamil

Sai Pallavi: సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు. డబుల్‌ రెమ్యునరేషన్‌ ఇస్తామన్నా ఇష్టం లేకపోతే చేయదు. కథ, క్యారెక్టర్‌ నచ్చితేనే సినిమాకు సైన్‌ చేస్తుంది. అందుకే తక్కువ సినిమాలు చేసింది. మొత్తానికి రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది సాయిపల్లవి. ప్రస్తుతం నటిస్తున్న ఆ మూడు సినిమాలు ఆసక్తికరమైనవే. విరాటపర్వం తర్వాత తెలుగుసినిమా ఓకే చేయడానికి సాయిపల్లవి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి సినిమా ప్రీ పొడక్షన్‌ వర్క్ మొదలై చాలాకాలం అయింది.

ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలో జాలరిగా చైతు నటిస్తుంటే, ఆయన భార్యగా సాయిపల్లవిని తీసుకున్నారు. ఈ ఇద్దరూ గతంలో లవ్‌స్టోరీలో జత కట్టారు. విరాటపర్వం తర్వాత చైతు సినిమా కంటే ముందే తమిళ సినిమా ఓకె చేసిన సాయిపల్లవి శివ కార్తికేయన్‌తో జత కడుతోంది. ఈ సినిమాను కమల్‌హాసన్‌ నిర్మించడం విశేషం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పూర్తి కాగా.. మరో హిందీ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హిందీలో రూపొందే రామాయణంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది.

ఇప్పటికే సాయిపల్లవిపై మేకప్‌ టెస్ట్ కూడా నిర్వహించి ఫైనల్‌ చేసినా.. అధికారికంగా వెల్లడించాల్సి వుంది. ఇలా నిన్నటివరకు ఖాళీగా వున్నట్టు కనిపించిన సాయిపల్లవి తెలుగు, తమిళం, హిందీలో సినిమాలతో ఒక్కసారిగా బిజీ అయిపోయింది.