Sai Pallavi: ఎన్టీఆర్ ని లెక్క చేయకపోవటం బిగ్ మిస్టేక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్ వేరు. రేంజ్ వేరు. మాస్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు.. అలాంటి స్టార్ హీరోతో జోడీకట్టడం అంటే హీరోయిన్ ఫేటే మారిపోతుంది. కాని ఎన్టీఆర్ నే లెక్క చేయలేదు ఓ హీరోయిన్.. ఆమె ఎవరు? ఎందుకు లైట్ తీసుకుంది? టేకేలుక్

Sai Pallavi turned down the glamor role in Devara, directed by Koratala Siva starring Junior NTR.
కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. ఆల్రెడీ 15 శాతం షూటింగ్ ని మొన్నటి షెడ్యూల్ లోనే తెరకెక్కించాడు కొరటాల. ఇప్పుడు జాన్వీ తో తారక్ రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అంతా బానే ఉంది కాని, యంగ్ టైగర్ విషయంలో సాయిపల్లవి చేసిన తప్పు మెల్లిగా బయటికొస్తున్నట్టుంది.
ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం ఇలా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ, హీరో స్థాయిలో ఇక్కడ మార్కెట్ ని, క్రేజ్ ని సంపాదించుకుంది సాయిపల్లవి. ముద్దులు, వల్కర్ డ్రెస్సులు ఇలాంటివేం లేకుండా, చాలా డీసెంట్ గా కనిపిస్తూ మన ఇంట్లో ఒకరనిపించే పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతవరకు ఓకే కాని, తన ప్రిన్సిపుల్స్ పేరుతో హీరోనే లెక్కచేయకపోవటం హాట్ టాపిక్ గా మారింది.
నచ్చితేనే చేస్తా, నచ్చకపోతే చేయనంటూ నిర్మాతకి ముఖం మీదే చెప్పేసే సాయిపల్లవి ప్రవర్తనే నిర్మాతలకు యాటిట్యూడ్ లా కనిపిస్తోందట. పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ మూవీ దేవరలో జాన్వీకంటే ముందు సాయిపల్లవినే సంప్రదిస్తే, గ్లామర్ రోల్ చేయనని నిర్మొహమాటంగా చెప్పిందట. గతంలోనే ఎమ్ సీ ఏ మూవీ చేస్తున్నప్పుడే నానితో గొడవలు, తర్వాత కణం మూవీ విషయంలో నాగశౌర్యతో జరిగిన గొడవలు, ఇలా తన ఇమేజ్ ని ఇండస్ట్రీలో డ్యామేజ్ చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ఆఫర్ ని కాదనటం, లేటుగా బయటికి వచ్చినా, సాయిపల్లవి తన కెరీర్ ని తానే డ్యామేజ్ చేసుకుంటోందన్న కామెంట్లు పెరిగాయి.