ప్లే బాయ్ తో సాయి పల్లవి.. లిప్ లాక్ సీన్స్ కు ఓకే చేస్తుందా…?
సౌత్ ఇండియాలో ఇప్పుడు సాయి పల్లవి పేరు వింటే చాలు జనాలు ఊగిపోతున్నారు. లేడీ పవర్ స్టార్ గా టాలీవుడ్ ను అలాగే కోలీవుడ్ ను దుమ్ము రేపుతుంది ఈ అమ్మాయి.

సౌత్ ఇండియాలో ఇప్పుడు సాయి పల్లవి పేరు వింటే చాలు జనాలు ఊగిపోతున్నారు. లేడీ పవర్ స్టార్ గా టాలీవుడ్ ను అలాగే కోలీవుడ్ ను దుమ్ము రేపుతుంది ఈ అమ్మాయి. ఇక రామాయణ సినిమాతో బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి రెడీ అవుతుంది. తమిళంలో అమరన్ అనే సినిమాతో లాస్ట్ ఇయర్ దుమ్మురేపింది. క్లాస్ ఆడియన్స్ ను బుట్టలో వేస్కుంది. ఈ హీరోయిన్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటనకు జనాలు జేజేలు కొట్టారు. ఇక ఇప్పుడు ఈమె నాగచైతన్య హీరోగా వచ్చిన తండేల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.
ఆ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ వారం కూడా సినిమాకు భారీగా వసూళ్లు వచ్చే ఛాన్స్ కనబడుతోంది. ఏకంగా ఈ సినిమా 150 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు జనాలు. ఇక ఇప్పుడు సాయి పల్లవి కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోతుంది. గ్లామర్ పాత్రలకు చాలా దూరంగా ఉండే సాయి పల్లవి, నటనకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే నటిస్తుంది అనే పేరు ఉంది. ఇప్పుడు ఓ ప్లే బాయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సెన్సేషన్ అవుతుంది.
తమిళ స్టార్ హీరో శింభు ఈమె ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వార్తలు వస్తున్నాయి. శింబు రీసెంట్ గా మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మరో మూడు చిత్రాల్లో శింభు నటించనున్నాడు. రామ్ కుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో ఆమె నటించడానికి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేడు శింభు పుట్టినరోజు కానుకగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎలాగైనా ఒప్పించాలని ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి సాయి పల్లవి సినిమాలంటే లిప్ లాక్ సీన్స్ గాని.. గ్లామర్ సీన్స్ గాని ఛాన్స్ ఉండదు. కానీ ఈ హీరో సినిమాల్లో.. కచ్చితంగా లిప్ లాక్ సీన్లు, హీరోయిన్ గ్లామర్ సీన్లతో పాటుగా కాస్త బొల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. దీనితో సాయి పల్లవి ఓకే చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే తన లిమిట్ దాటకుండా నటించే సాయి పల్లవి.. ఇప్పుడు ఇది ఓకే చేస్తే.. సెన్సేషన్ అని చెప్పాలి. మరి తాను సినిమా చేసే ముందే కండిషన్ లు పెట్టే సాయి పల్లవి.. ఈ తమిళ్ ప్లే బాయ్ సినిమాకు ఏ కండిషన్ లో పెడుతుందో చూడాలి. ఇక ఎవరితో సినిమా చేస్తే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటాడు అనే రూమర్ కూడా శింభు పై గట్టిగానే వినపడుతూ ఉంటుంది. గతంలో నయనతార తో పాటుగా హన్సిక, హర్షిక, త్రిష, సనా ఖాన్ వంటి వారితో కూడా అతనికి ఎఫైర్స్ ఉన్నాయని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. మరి అలాంటి హీరోతో ఆమె నటిస్తుందా అనేది చూడాలి.