పదేళ్లుగా ప్రేమలో ఉన్నా సాయి పల్లవి దిమ్మతిరిగే ట్విస్ట్‌

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో మాస్‌ హీరోలతో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరోయిన్‌ ఆమె. డ్రెస్సింగ్‌ గురించి శాంపిల్‌ చూపించాలన్నా.. క్యారెక్టర్‌ గురించి ఎగ్జాంపుల్‌ చెప్పాలన్నా.. ఇండస్ట్రీలో అందరికీ ఫస్ట్‌ గుర్తొచ్చేది ఆమె పేరే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2024 | 12:59 PMLast Updated on: Dec 10, 2024 | 12:59 PM

Sai Pallavis Heartbreaking Twist Despite Being In Love For Ten Years

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో మాస్‌ హీరోలతో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరోయిన్‌ ఆమె. డ్రెస్సింగ్‌ గురించి శాంపిల్‌ చూపించాలన్నా.. క్యారెక్టర్‌ గురించి ఎగ్జాంపుల్‌ చెప్పాలన్నా.. ఇండస్ట్రీలో అందరికీ ఫస్ట్‌ గుర్తొచ్చేది ఆమె పేరే. ఒకప్పటి సావిత్రి తరువాతి సౌందర్య లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తోంది స్టార్‌ హీరోయిన్‌, లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి. ఎక్స్‌పోజింగ్‌తో కాకుండా యాక్టింగ్‌తో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పల్లవి. గ్లామర్‌షోతో ఆఫర్లు కొట్టేస్తున్న ఈ రోజుల్లో.. టాలెంట్‌తో ఎంతో మంది డ్రీగ్‌గర్ల్‌గా అంతకు మించి ఫ్యాన్స్‌ ఆరాధించే వ్యక్తిగా మారిపోయింది. అలాంటి సాయిపల్లవి 10 ఏళ్ల నుంచి ఓ వ్యక్తితో లవ్‌లో ఉందట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయం చెప్పింది సాయి పల్లవి.

సాయి పల్లవి పదేళ్ల నుంచి ఓ వ్యక్తిని లవ్‌ చేస్తోందా అంటూ మీలాగే చాలా మంది షాకయ్యారు. కానీ మళ్లీ క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్‌ను కూల్‌ చేసింది పల్లవి. ఆమె లవ్‌ చేస్తుంది ఈ కాలం వ్యక్తిని కాదు. మహాభారతంలోని అభిమన్యు క్యారెక్టర్‌ని. దాదాపు పదేళ్ల ముందు తాను మొదటిసారి మహాభారతం చదివినప్పుడు అభిమన్యు క్యారెక్టర్‌తో లవ్‌లో పడిపోయిందట సాయిపల్లవి. మొత్తం మహాభారతంలో అభిమన్యు క్యారెక్టర్‌ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమట. తన జీవితంలో చాలా విషయాలు అభిమన్యు క్యారెక్టర్‌ ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని నేర్చుకుందట. ఇప్పటికీ ఆ క్యారెక్టర్‌ను అదే స్థాయిలో ఇష్టపడుతోందట సాయిపల్లవి. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాక కాస్త కూల్‌ అయ్యారు సాయి పల్లవి డై హార్డ్‌ ఫ్యాన్స్‌. ఇంత ఫాస్ట్‌ అండ్‌ ఫ్యాషన్‌ జెనరేషన్‌లో కూడా మహాభారత కాలం నాటి క్యారెక్టర్‌ను అడ్మైర్‌ చేస్తోంది అంటే.. నిజంగానే సాయి పల్లవి చాలా గ్రేట్‌ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు ఆమె అభిమానులు.