Sai Pallavi: లవర్‌ను పరిచయం చేసిన సాయిపల్లవి చెల్లి.. ఈమె చాలా ఫాస్ట్ గురూ..!
సాయిపల్లవి చెల్లెలి పేరు పూజాకన్నన్. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది! పండగపూట బాయ్‌ఫ్రెండ్‌ను పూజా కన్నన్ పరిచయం చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలతో ఉన్న ఒక వీడియోను పూజా కన్నన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Sai Pallavi: అందం సంగతి ఎలా ఉన్నా.. సాయిపల్లవి (Sai Pallavi) చుట్టూ ఉండే ఒకరకమైనా ఆరా.. కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. మనసుల్ని కట్టిపడేసే తెలియని ఆకర్షణ.. సాయిపల్లవి సొంతం. అందుకే సాయిపల్లవిని హీరోయిన్‌గా అభిమానించేవాళ్ల కంటే.. సాయిపల్లవిగా ప్రేమించేవాళ్లే ఎక్కువ. నచ్చితే సినిమాలు చేస్తుంది..నచ్చకపోతే కోట్లు ఇచ్చినా అటు వైపు కూడా చూడదనే పేరు ఉంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు అయినా.. ఆమె చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
MAHESH BABU: మహేశ్‌బాబుకు మరో కొత్త టెన్షన్..
జనాలతో కలవడంసహా అనేక విషయాల్లో సాయిపల్లవి చాలా స్లో. ఇంట్రోవర్ట్ అనొచ్చు ఒకరకంగా. ఐతే ఆమె చెల్లి మాత్రం.. చాలా ఫాస్ట్ గురూ అంటోంది సోషల్ మీడియా. సాయిపల్లవి చెల్లెలి పేరు పూజాకన్నన్. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది! పండగపూట బాయ్‌ఫ్రెండ్‌ను పూజా కన్నన్ పరిచయం చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలతో ఉన్న ఒక వీడియోను పూజా కన్నన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ అందమైన లిటిల్ బటన్ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఎలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్. నిన్నటివరకు నా క్రైమ్ పార్టనర్.. ఇప్పుడు నా పార్టనర్. ఐ లవ్‌యూ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. ఇది చూసి పూజా కన్నన్ పెండ్లి ఫిక్సయ్యిందని ప్రచారం జరుగుతోంది.
దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. సాయిపల్లవి ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా షాకయ్యారు. అక్క ఉండగానే.. చెల్లెలు పెండ్లికి రెడీ అయిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారు. సాయిపల్లవిలాగా కాదు.. పూజా చాలా ఫాస్ట్ గురూ అంటున్నారు మరికొందరు. ఇక పూజ కన్నన్ కూడా.. సాయిపల్లవిలానే నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చిత్తరాయి సెవ్వనం అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత ఛాన్స్‌లు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ సర్వీస్ చేస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి తన లవర్‌ను పరిచయం చేయడంతో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.