NTR 30: కన్ఫాం.. ఎన్టీఆర్ 30లో సైఫ్‌ అలీ ఖాన్‌.. ఫొటో షేర్‌ చేసిన కొరటాల

ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న బాలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ తాజాగా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. షూటింగ్‌ సెట్స్‌లో సైఫ్‌కు కొరటాల శివ, ఎన్టీఆర్‌ వెల్‌కం చెప్పారు. సైఫ్‌ ఆన్‌ బోర్డ్‌.. వెల్‌కం.. అంటూ ఫొటో షేర్‌ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2023 | 12:12 PMLast Updated on: Apr 18, 2023 | 12:12 PM

Saif Ali Khan Joins The Sets Of Ntr 30 To Play The Antagonist In Telugu Debut

NTR 30: కొరటాల శివ, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్‌ 30 సినిమా షూటింగ్‌ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ ఆల్రెడీ కంప్లీట్‌ అయిపోయింది. ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న బాలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ తాజాగా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు.

షూటింగ్‌ సెట్స్‌లో సైఫ్‌కు కొరటాల శివ, ఎన్టీఆర్‌ వెల్‌కం చెప్పారు. సైఫ్‌ ఆన్‌ బోర్డ్‌.. వెల్‌కం.. అంటూ ఫొటో షేర్‌ చేశారు. ఇవాళ్టి నుంచి సైఫ్‌, ఎన్టీఆర్‌పై కొన్ని సీన్స్‌ షూట్‌ చేయనున్నారు. బాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేశాడు సైఫ్‌. హీరోగా మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. తానాజీ సినిమాలో విలన్‌గా కేక పెట్టించాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ 30లో కూడా సైఫ్‌‌ను అదే రేంజ్‌లో చూపించబోతున్నాడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారు. ఎన్టీఆర్‌ 30 ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ.

ఇటు ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు.. బాలీవుడ్‌ యాక్టర్స్‌.. హాలీవుడ్‌ టెక్నీషయిన్స్‌ ఈ సినిమా కోసం పని చేస్తుండటంతో ఎన్టీఆర్‌30పై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పాన్‌ ఇండియా టార్గెట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్‌ చేశాడు కొరటాల శివ. యాక్షన్‌ సీన్స్‌ కోసం భారీ సెట్లు వేయించాడు. స్టంట్స్‌, గ్రాఫిక్స్‌ కోసం ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపాడు. సినిమా లాంచింగ్‌ రోజే స్టోరీ లైన్‌ చెప్పి ఆడియన్స్‌ అటెన్షన్‌ గ్రాబ్‌ చేశాడు. 2024 ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఎన్టీఆర్‌ 30 ఎలాంటి సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.